Prema Desam: మరోసారి వెండితెరపై అందమైన ప్రేమ కథ.. రీరిలీజ్ జాబితాలో ప్రేమ దేశం..
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులకు ఉర్రూతలుగించిన చిత్రాలను ఈతరం టెక్నాలజీకి అనుగుణంగా 4కే, డాల్బీ వంటి అధునాతన సాంకేతికతలను జోడించి మళ్లీ విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులకు నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ రీరిలీజ్‌పై..
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులకు ఉర్రూతలుగించిన చిత్రాలను ఈతరం టెక్నాలజీకి అనుగుణంగా 4కే, డాల్బీ వంటి అధునాతన సాంకేతికతలను జోడించి మళ్లీ విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులకు నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ రీరిలీజ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో పోకిరి చిత్రంతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు పీక్‌కి చేరింది. హీరో పుట్టిన రోజు, లేదా సినిమా సిల్వర్ జుబ్లీలాంటి ఇవెంట్స్ సందర్భంగా సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి మరో అందమైన ప్రేమ కథా చిత్రం వచ్చి చేరుతోంది. అదే 90ల్లో యువతను కట్టిపడేసిన ప్రేమదేశం.
1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచనలం సృష్టించింది. వినీత్, అబ్బాస్, టబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్లతో పాటు, ప్రేక్షకులను సైతం తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు గడుస్తున్న తర్వాత ఇప్పుడు రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే వాలైంటేన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే ప్రేమద దేశం మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ఈ సినిమాలోనే పాటలు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ఆకట్టుకుటున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఇక యువత అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ ఇప్పటికీ నిత్య నూతనమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..