Anu Emmanuel : ప్రేమ.. పెళ్లి గురించి హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం ఆమె ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అను తన లైఫ్ గురించి చెప్పుకొచ్చింది.

Anu Emmanuel : ప్రేమ.. పెళ్లి గురించి హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Anu Emmanuel
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 23, 2022 | 4:26 PM

అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలకు అమడదూరంలో ఉన్న హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. న్యాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. శైలజరెడ్డి అల్లుడు.. అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన బ్రేక్ రాలేదు. దీంతో కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చాలాకాలంగా బిగ్ స్క్రీన్ పై సందడి చేయని అను.. ఇప్పుడు ఊర్వశివో రాక్షసివో సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ హీరో అల్లు శిరీష్ ఇందులో కథానాయికుడిగా కనిపించనుండగా.. నూతన డైరెక్టర్ రాకేశ్ శశి తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ధీరజ్ మొగలినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్.

అయితే కొద్ది రోజులుగా అను ఇమ్మాన్యుయేల్ ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో పరొక్షంగా స్పందించింది అను. తాను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేనని.. డేటింగ్ కూడా చేయడం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉందని తెలిపింది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే