AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : అతడి ఫర్ఫామెన్స్ అద్భుతం.. ఆద్యంతం కట్టిపడేసింది.. ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఓ సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. సినిమాలోని నటీనటులు, డైరెక్షన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ram Charan : అతడి ఫర్ఫామెన్స్ అద్భుతం.. ఆద్యంతం కట్టిపడేసింది.. ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Mar 21, 2026 | 7:15 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. స్పోర్ట్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు చరణ్. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ మూవీ పేరు నెట్టింట మారుమోగుతుంది. ఆ సినిమా ఏంటో కాదండి.. బాక్సాఫీస్ సెన్సేషన్ ధురంధర్ 2. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీపై ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. తాజాగా రామ్ చరణ్ సైతం సినిమా గురించి చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

ధురంధర్ 2 సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. ఎప్పటిలాగే రణవీర్ సింగ్ అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఆ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అన్నారు. “ధురంధర్ ది రివెంజ్.. చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఆధిత్య ధర్ ఈ సినిమా స్థాయిని, భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకు ఆయన పనిచేసిన తీరు ఆశ్చర్యకరం. ఇక రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. అలాగే మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ నటనతో ఆకట్టుకున్నారు. సారా అర్జున్ సైతం మెప్పించింది. సుస్వత్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇంతటి ఆసక్తికరమైన సినిమాను అందించిన నిర్మాతలకు, మూవీ టీంకు అభినందనలు ” అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

గతంలో వచ్చిన ధురంధర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us