ATM: వెయ్యి రూపాయలు డ్రా చేస్తే రెండు వేల నోటు.. ఏటీఎమ్‌ సెంటర్‌కు ఎగబడ్డ జనాలు.. ఎక్కడంటే..

సాంకేతిక లోపం కారణంగా కొన్ని సందర్భాల్లో ఏటీఎమ్‌ల పనితీరులో అవకతవకలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎంటర్‌ చేసిన దాని కంటే తక్కువ అమౌంట్‌ వస్తే మరికొన్నిసార్లు ఎక్కువ అమౌంట్‌ వస్తుంటాయి. ఎంటర్‌ చేసిన అమౌంట్‌ కంటే ఎక్కువ విత్‌డ్రా..

ATM: వెయ్యి రూపాయలు డ్రా చేస్తే రెండు వేల నోటు.. ఏటీఎమ్‌ సెంటర్‌కు ఎగబడ్డ జనాలు.. ఎక్కడంటే..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 25, 2022 | 5:36 PM

సాంకేతిక లోపం కారణంగా కొన్ని సందర్భాల్లో ఏటీఎమ్‌ల పనితీరులో అవకతవకలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎంటర్‌ చేసిన దాని కంటే తక్కువ అమౌంట్‌ వస్తే మరికొన్నిసార్లు ఎక్కువ అమౌంట్‌ వస్తుంటాయి. ఎంటర్‌ చేసిన అమౌంట్‌ కంటే ఎక్కువ విత్‌డ్రా అయిన సంఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి సిద్దిపేట పట్టణంలో జరిగింది.

నగరంలో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఓ ఏటీఎమ్‌ సెంటర్‌లో రూ. 1000 డ్రా చేస్తే రూ. 2000 రావడం కలకంల రేపింది. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు పెద్ద ఎత్తున ఏటీఎమ్‌కు క్యూ కట్టారు. అప్పటికే చాలా మంది డబ్బులు విత్‌డ్రా కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయం కాస్త ఆ నోట, ఈ నోట విని బ్యాంకు అధికారులకు సమాచారం అందింది.

దీంతో వెంటనే ఏటీఎమ్‌ వద్దకు చేరుకున్న అధికారులు ఏటీఎమ్‌ను మూసేశారు. ఏటీఎమ్‌లో నెలకొన్ని సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు. అయితే అప్పటికే డబ్బులు డ్రా చేసుకున్న వారి నుంచి డబ్బులను ఎలా రికవరీ చేయాలన్న దానిపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..