Google: గూగుల్ కు గట్టి షాక్.. మరోసారి భారీ జరిమానా.. పద్ధతి మార్చుకోవాలంటూ..

సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌కు మరోసారి భారీ షాక్‌ తగిలింది. గూగుల్‌ తన ప్లేస్టోర్‌ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. గూగుల్‌ మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ..

Google: గూగుల్ కు గట్టి షాక్.. మరోసారి భారీ జరిమానా.. పద్ధతి మార్చుకోవాలంటూ..
Google
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 25, 2022 | 9:38 PM

సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌కు మరోసారి భారీ షాక్‌ తగిలింది. గూగుల్‌ తన ప్లేస్టోర్‌ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. గూగుల్‌ మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ రూ.936.44 కోట్లు జరిమానా వేసింది. తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. యాప్‌ డెవలపర్లు తమ యాప్‌.. యూజర్లకు చేరాలంటే యాప్‌స్టోర్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, దేశంలో వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో చాలా వరకు ఆండ్రాయిడ్‌వే. దీంతో యాప్‌ డెవలపర్లకు ప్లేస్టోర్‌ ఒక్కటే ఆధారంగా మారింది. ప్లేస్టోర్‌లో తమ యాప్‌ లిస్ట్‌చేయాలంటే గూగుల్‌ నియమాలను పాటించడంతో పాటు, గూగుల్ ప్లే బిల్లింగ్‌ సిస్టమ్‌ను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని గమనించిన సీసీఐ.. గూగుల్‌కు పెనాల్టీ విధించింది. వారం తిరగకముందే గూగుల్‌పై సీసీఐ విధించిన రెండో జరిమానా ఇది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందంటూ ఇటీవలే రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని పేర్కొంటూ ఇటీవల రూ.1337.76 లక్షల జరిమానా చెల్లించాల సీఐఐ ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని గూగుల్ కు సీసీఐ హితవు కూడా పలికింది. స్మార్ట్ ఫోన్ పని చేయాలంటే దానికి ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్) కావాలి. అలాంటి ఓఎస్ లలో ఆండ్రాయిడ్ ఒకటి. దాన్ని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. మొబైల్ కంపెనీలు దాదాపు ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నాయి.

ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ప్లేస్టోర్, గూగుల్ సెర్చ్, గూగుల్ క్రోమ్, య్యూటూబ్ తదితర అప్లికేషన్లను గూగుల్ కలిగుందని సీసీఐ పేర్కొంది. ఇక వీటి ద్వారా పోటీ వ్యతిరేక పద్దతులను గూగుల్ అవలంభిస్తోందని పేర్కొంటూ గూగుల్ కు జరిమానా విధించింది. గూగుల్ అందించే ఫ్రీ ఇన్ స్టాల్ యాప్స్ ను డిలీట్ చేయకుండా నిరోధించడం వంటివి చేయకూడదు అంటూ పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.