Diwali: మీరెక్కడ తయారయ్యార్రా బాబూ.. దీపావళిని ఇలా కూడా చేసుకోవచ్చా.. ఏకంగా కారునే..
దీపావళి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది టపాసులు.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సోషల్ మీడియాలో..
దీపావళి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది టపాసులు.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమో లేదా ఎంజాయ్ చేయడం కోసమో చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఎంతో నష్టం అని తెలిసినా.. కావాలని పనిగట్టుకుని తుంటరి పనులు చేస్తుంటారు. కాని దీపావళిలో బాణాసంచా కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్స్ ట్రాలు చేస్తే ఎంతో ప్రమాదం కూడా. ఎన్ని తుంటరి పనులు చేసినా బాణాసంచా కాల్చే విషయంలో మాత్రం తుంటరి వేషాలు వేస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో పెద్దవాళ్లు కూడా బాణాసంచా కాల్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు సూచిస్తారు. చిన్న పిల్లలు అయితే పేరెంట్స్ దగ్గరుండి బాణాసంచా కాల్పిస్తారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడం, అలాగే యూటూబ్ లో అప్ లోడ్ చేసే వీడియోలకు వీవర్ షిప్ కోసం ఏ పనినైనా కొంత వినూత్నంగా, వెరైటీగా చేస్తున్నారు టపాసులు కాల్చే విషయంలో ఎవరి స్టైల్ వారికే ఉంటుంది. దీపావళి రోజు వెరైటీగా బాణాసంచా కాల్చలనుకున్న ఓ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్ కొత్తగా ఆలోచించాడు. అందరిలా మామూలుగా బాణాసంచా కాలిస్తే వెరైటీ ఏముందిలే అనుకున్నాడో ఏమో.. కొంత డిఫరెంట్‌గా థింక్ చేశాడు. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ.. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్ చేశాడు. దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులను వరసగా పేర్చాడు. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం అంకెలు లెక్కపెడుతూ.. రెడీ అని కారుపై పేర్చిన బాంబులను పేల్చాడు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్ధంతో మారుమోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ కారు దగ్గరుకు వెళ్లాడు.
బాంబులు పేలడంతో కారు కలర్ మొత్తం మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయి ఉంది. కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్ పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్ మాత్రం పనిచేయడం గమనర్హం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
#Watch: Ahead of Diwali, this Youtuber sets car on fire by covering it with firecrackers, video goes viral #ViralVideo #Diwali
Video Courtesy: Crazy XYZ pic.twitter.com/oUixu6f5sR
— NewsMobile (@NewsMobileIndia) October 23, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..