Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tornado: ఇదెక్కడి టోర్నడోరా బాబూ.. చూస్తుంటేనే వణుకు పుడుతోంది.. నెట్టింట చక్కర్లు కొడుతున్న దృశ్యాలు..

ఉత్తర ఫ్రాన్స్‌ ప్రాంతంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. బిహుకోర్ట్‌ అనే గ్రామంలో సంభవించిన ఈ మినీ టోర్నడో స్థానికులకు భయభ్రాంతులకు గురి చేసింది. సుడిగాలి ధాటికి గ్రామంలోని పదుల సంఖ్యలో..

Tornado: ఇదెక్కడి టోర్నడోరా బాబూ.. చూస్తుంటేనే వణుకు పుడుతోంది.. నెట్టింట చక్కర్లు కొడుతున్న దృశ్యాలు..
Tornado Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 24, 2022 | 9:04 PM

ఉత్తర ఫ్రాన్స్‌ ప్రాంతంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. బిహుకోర్ట్‌ అనే గ్రామంలో సంభవించిన ఈ మినీ టోర్నడో స్థానికులకు భయభ్రాంతులకు గురి చేసింది. సుడిగాలి ధాటికి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు, భవనాలు చూస్తుండగానే నేలమట్టమయ్యాయి. ఆ ప్రాంతంలో అకాలంగా వేడి వాతావరణం ఏర్పడింది. అనంతరం టోర్నడోగా మారినట్లు స్థానిక అధికారులు తెలిపారు. టోర్నడో విధ్వంసం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బిహుకోర్టు గ్రామంలో అక్టోబరు 23 సాయంత్రం సమయంలో ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత కాసేపటికే ఒక్కసారిగా సుడిగాలి చెలరేగినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో షేర్‌ చేశారు.

సుడిగాలి ధాటికి ఇళ్లపై షెడ్లు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు ధ్వంసమైపోయాయి. ఈ టోర్నడో బీభత్సంలో కొందరు గాయపడినట్లు పాస్‌ డీ కలాయిస్‌ ప్రాంత అధికార యంత్రాంగం తెలిపింది. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించింది. కొన్ని సంవత్సరాలుగా టోర్నడోలు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నాయని అక్కడి ‍ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.