Rishi Sunak: ‘అదే నా లక్ష్యం’.. ఇవాళ కింగ్ చార్లెస్‌తో భేటీ కానున్న బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్

బ్రిటన్‌ ప్రధాని పదవిని దక్కించుకొని భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. 42 ఏళ్ల సునాక్‌కు అభినందనలు వెలువెత్తాయి. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్థను బాగు చేయడమే తన లక్ష్యమని రిషి సునాక్‌ వెల్లడించారు.

Rishi Sunak: ‘అదే నా లక్ష్యం’.. ఇవాళ కింగ్ చార్లెస్‌తో భేటీ కానున్న బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్
Rishi Sunak
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 25, 2022 | 7:17 AM

బ్రిటన్‌ ప్రధాని పదవిని దక్కించుకొని భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. 42 ఏళ్ల సునాక్‌కు అభినందనలు వెలువెత్తాయి. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్థను బాగు చేయడమే తన లక్ష్యమని రిషి సునాక్‌ వెల్లడించారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తిరిగి గాడిన పడేలా చెయ్యడమే తన తొలి ప్రాధాన్యమని బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ వివరించారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐక్యత, స్థిరత్వం ముఖ్యమని రిషి వివరించారు. కన్జర్వేటివ్ పార్టీని, యూకేని ఒకచోట చేర్చడం తన అత్యంత ప్రాధాన్యమైన విషయమని తెలిపారు. తనను ప్రధానిగా ఎన్నుకున్నందుకు పార్టీ సహచరులకు కృతజ్ఞతలు చెప్పిన రిషీ.. బ్రిటిష్ ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. కాగా.. ప్రమాణస్వీకారానికి ముందు రిషి సునాక్ ఈరోజు (మంగళవారం) కింగ్ చార్లెస్‌ను కలవనున్నారు. ఆయనతో భేటీ అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రిషి బ్రిటన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికతో బ్రిటన్‌లో కొత్త చరిత్ర మొదలయ్యింది. 200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన ఇంగ్లాండ్‌కు తొలిసారిగా భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ప్రధాని అయ్యారు. ప్రధాని రేసు నుంచి పెన్నీ మోర్డాండ్‌ తప్పుకున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రిషి సునాక్‌ . బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టడమే తన లక్ష్యమని ప్రకటించడంతో.. ప్రపంచం మొత్తం ఆయనవైపే చూస్తోంది.

మొదట పోటీలో ఉండేందుకు ఆసక్తి కనబరిచి.. మళ్లీ తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటు పలువురు కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు రిషి సునాక్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వందేళ్లలో బ్రిటన్‌కు యంగెస్ట్‌ పీఎం లభించారంటూ కొనియాడారు. లిజ్‌ ట్రస్‌ రాజీనామా తరువాత రిషి సునాక్‌కు బ్రిటన్‌ ప్రధానిగా సేవ చేసే అవకాశం లభించింది.

ఇవి కూడా చదవండి

అభినందనల వెల్లువ..

కాగా.. రిషి సునాక్‌కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా భారత్‌లోని ప్రముఖులందరూ రిషికి శుభాకాంక్షలు తెలిపారు. 2030 రోడ్ మ్యాప్ ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేద్దామంటూ ప్రధాని మోడీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైతం రిషికి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..