యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..

పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..
Yadadri Chemical Factory
Follow us

|

Updated on: Oct 26, 2022 | 9:03 PM

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని బీబీనగర్ మండల పరిధిలోని చందక్ లేబొరేటరీస్‌ భారీ పేలుడు సంభవించింది. బుధవారం మధ్యాహ్నం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచరాం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

బీబీనగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. చందక్ లేబొరేటరీస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి