Diabetes: ఉదయాన్నే ఈ పనులు చేస్తే మీ మధుమేహం అదుపులో ఉంటుంది..!

ఆకస్మికంగా బరువు తగ్గడం, అధిక దాహం, ఆకస్మికంగా ఆకలి లేకపోవడం, అస్పష్టమైన దృష్టి, అన్ని సమయాలలో అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

Diabetes: ఉదయాన్నే ఈ పనులు చేస్తే మీ మధుమేహం అదుపులో ఉంటుంది..!
Diabetes
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2022 | 5:08 PM

మధుమేహం నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా, ఈ వ్యాధి ఉన్నవారు పాటించాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. మీరు ప్రతి ఉదయం ఈ ఐదు అలవాట్లను పాటిస్తే మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. సరికాని జీవనశైలి వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు తరచుగా ప్రమాదకరమైనవి. అసమతుల్య జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవాంఛిత అలవాట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. హై బ్లడ్ షుగర్ లక్షణాలు ఆకస్మికంగా బరువు తగ్గడం, అధిక దాహం, ఆకస్మికంగా ఆకలి లేకపోవడం, అస్పష్టమైన దృష్టి, అన్ని సమయాలలో అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేసుకోవాలంటే ఉదయాన్నే ఈ 5 పనులు చేయండి…

నీళ్లు తాగడం- నీళ్లు తాగడం ద్వారా అనేక వ్యాధులను కొంత వరకు నియంత్రించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి పుష్కలంగా నీళ్లు తాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. సరిపడా నీరు తాగకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి, ఉదయం నిద్రలేచిన తర్వాత పుష్కలంగా నీరు తాగడం వల్ల రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్ – ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్‌ను చేర్చుకోవడం మంచిది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. అల్పాహారం మానేయకండి.

కాఫీ – కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉండటం మంచిది. కాఫీ తాగాలనే తపన ఉన్నవారు మితంగా మాత్రమే తీసుకుంటే మంచిది.

వ్యాయామం – ఉదయం నిద్రలేచిన వెంటనే వ్యాయామం, వాకింగ్‌ చేయటం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఒత్తిడి – ఒత్తిడి పెరిగినప్పుడు అది అనేక వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. ఉదయం లేవగానే అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురికాకండి. అందువలన ఒత్తిడి పెరిగినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. శాంతితో రోజు ప్రారంభించండి. ఉదయం వ్యాయామం, యోగా మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి