High Blood Pressure: అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగారంటే..
అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. అధిక రక్తపోటు వల్ల మెదడులో రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది. రక్తాన్ని పంప్ చేయడంలో గుండె ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఐతే ఈ జ్యూస్‌లను ప్రతి రోజూ తాగితే..
Updated on: Oct 28, 2022 | 1:53 PM

అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. అధిక రక్తపోటు వల్ల మెదడులో రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది. రక్తాన్ని పంప్ చేయడంలో గుండె ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఐతే ఈ విధమైన జ్యూస్‌లను ప్రతి రోజూ తాగడం వల్ల మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. కాకరకాయలో ఉండే విటమిన్-ఎ, సి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ రెండింటినీ సమతుల్యంగా ఉంచుతాయి.

టమాటలో విటమిన్ సి, ఎ వంటి పోషక మూలకాలు ఎన్నో ఉంటాయి. అలాగే దీనిలో భాస్వరం, రాగి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించే శక్తి ఉంటుంది.

పాలకూర శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. శరీరానికి మేలు చేసే పొటాషియం దీనిలో అధికంగా ఉంటుంది. పొటాషియం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు పాలకూర జ్యూస్ ప్రతి రోజూ తాగితే ఎంతో మేలు చేస్తుంది.

బీట్‌రూట్‌లో రక్తపోటును నియంత్రించే సోడియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఇతర పోషక మూలకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటితోపాటు నైట్రేట్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియను సరిచేస్తుంది.





























