- Telugu News Photo Gallery Cricket photos India vs netherlands rohit sharma has the most sixes in t20 world cup for india breaks yuvraj singh record
IND vs NED: హిట్‌మ్యాన్ ఖాతాలో భారీ రికార్డ్.. టీ20 ప్రపంచ కప్‌లో తొలి భారత ప్లేయర్.. రెండో స్థానంలో ఎవరంటే?
Rohit Sharma Records: నెదర్లాండ్స్‌పై రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేశాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు.
Updated on: Oct 27, 2022 | 3:28 PM

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ టీమ్ ఇండియాకు తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే ఇప్పుడు ఈ ఆందోళన కూడా ముగిసింది. నెదర్లాండ్స్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను తన పేరిట ఒక పెద్ద రికార్డును సృష్టించాడు.

నెదర్లాండ్స్‌పై 3 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 34 సిక్సర్లు బాది, 33 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్‌ను అధిగమించాడు. రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ 24 సిక్సర్లు కొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ 63 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

T20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కూడా తన 900 పరుగులు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో 897 పరుగులతో తిలకరత్నే దిల్షాన్‌ను అధిగమించాడు. ఇప్పుడు ఈ జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మకు ఈ ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా మ్యాచ్‌ల తర్వాత, రోహిత్ బ్యాట్ నుంచి అర్ధ సెంచరీ వచ్చింది. అతను దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్‌లో చివరి అర్ధ సెంచరీని సాధించాడు.

ఆ తర్వాత అతను దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌లో ఫ్లాప్ అయ్యాడు. కేవలం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో కూడా అతని బ్యాట్ పనిచేయలేదు.




