- Telugu News Photo Gallery Cricket photos Ind vs ned suryakumar yadav fastesr fifty against netherlands break mohammad rizwan record
IND vs NED: సూర్య ప్రతాపంతో కనుమరుగైన పాక్ ప్లేయర్.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన తొలి ప్లేయర్..
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ 204 స్ట్రైక్ రేట్‌తో 25 బంతుల్లో 51 పరుగులు చేశాడు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పిన బ్యాటర్‌గా నిలిచాడు.
Updated on: Oct 27, 2022 | 4:33 PM

నెదర్లాండ్స్‌పై సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 204 స్ట్రైక్ రేట్‌తో 25 బంతుల్లో 51 పరుగులు చేశాడు. సూర్యకుమార్ నెదర్లాండ్స్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఫలితంగా ఎన్నో కొత్త రికార్డులు సృష్టించడంతో పాటు ప్రపంచ రికార్డు కూడా బద్దలైంది.

నెదర్లాండ్స్‌పై 204 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన సూర్య.. 2022లో ఐదవసారి స్ట్రైక్ రేట్ 200 ప్లస్ దాటించాడు. ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అదేమిటంటే.. ఈ సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టిన రికార్డు ఏమిటో తెలుసుకుందాం. 2022లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇది. నెదర్లాండ్స్‌పై 51 పరుగుల ఇన్నింగ్స్‌లో 9వ పరుగు చేసిన వెంటనే సూర్యకుమార్ ఈ ఫీట్ చేశాడు.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేశాడు. 19 మ్యాచ్‌ల్లో 825 పరుగులు చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ వద్ద కేవలం 816 పరుగులు మాత్రమే.

కానీ, నెదర్లాండ్స్‌పై అజేయంగా 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది 25 మ్యాచ్‌ల్లో 867 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.





























