Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Kalyan: వైభవంగా యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ వివాహం.. మండపంలోనే కన్నీళ్లు పెట్టికున్న నవవధువు..

చెన్నైలోని తిరువెర్కాడులోని జీపీఎన్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది. తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు హరీష్. కుటుంబసభ్యులు నిశ్చయించిన తర్వాత మా మధ్య ప్రేమ చిగురించిందని..

Harish Kalyan: వైభవంగా యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ వివాహం.. మండపంలోనే కన్నీళ్లు పెట్టికున్న నవవధువు..
Harish Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 28, 2022 | 4:28 PM

కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నర్మదా ఉదయకుమార్‏తో ఏడు అడుగులు వేశాడు. ఇరువురి కుటుంబసభ్యులు.. స్నేహితులు.. సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం శుక్రవారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది. ఈ వేడకకు హీరోయిన్..హరీష్ స్నేహితురాలు బిందుమాధవి సైతం విచ్చేసి సందడి చేసింది. నూతన దంపతుల ఫోటోను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ అభినందనలు తెలిపింది. మరోవైపు హరీష్ దంపతులకు సినీ ప్రముఖులు.. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే హరీష్ తాళి కడుతున్న సమయంలో వధువు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

చెన్నైలోని తిరువెర్కాడులోని జీపీఎన్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది. తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు హరీష్. కుటుంబసభ్యులు నిశ్చయించిన తర్వాత మా మధ్య ప్రేమ చిగురించిందని.. నర్మదా ఉదయకుమార్ తన జీవిత భాగస్వామిగా రావడం సంతోషంగా ఉందన్నారు. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1లో హరీష్ కళ్యాణ్ రన్నరప్ గా నిలిచాడు. అలాగే న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు హరీష్. ఇందులో క్లైమాక్స్‏లో నాని తనయుడిగా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ఇవే కాకుండా.. ప్యార్ ప్రేమ కాదర్, ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం చిత్రాలతో తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాదలి చిత్రం తెలుగులోనూ విడుదలైంది. ఇక ఇప్పుడు హరీష్.. ధోనీ నిర్మించబోయే చిత్రంలో నటించనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.