Tapsee Pannu: ఫోటోగ్రాఫర్లపై తాప్సీ ఆగ్రహం.. అలా చేయొద్దంటూ వార్నింగ్..  ఏం జరిగిందంటే.. 

ఫోటోగ్రాఫర్లపై మళ్లీ హీరోయిన్ తాప్సీ మండిపడింది. అలా చేయొద్దు అంటూ ఏకంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ తాప్సీకి ఎందుకు అంత కోపం వచ్చిందంటే..

Tapsee Pannu: ఫోటోగ్రాఫర్లపై తాప్సీ ఆగ్రహం.. అలా చేయొద్దంటూ వార్నింగ్..  ఏం జరిగిందంటే.. 
Tapsee Pannu
Follow us

|

Updated on: Oct 27, 2022 | 3:34 PM

గత కొద్దిరోజులుగా హీరోయిన్ తాప్సీ ఎక్కువగా కాంట్రవర్సీ వార్తలలో నిలుస్తుంది. ఇటీవల ఆమె నటించిన దొబెరా సినిమా ప్రమోషనల్లో పాల్గొన్న సమయంలో ఫోటోగ్రాఫర్లకు .. ఆమెకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. తాజాగా మరోసారి ఆమె ఓ ఫోటోగ్రాఫర్ పై మండిపడింది. అలా చేయొద్దంటూ ఏకంగా అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. బుధవారం తాప్సీ కారులోకి ఎక్కి డోరు మూయటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను డోర్ మూయకుండా అడ్డుకుంటూ చేత్తో డోర్ ఆపి ఉంచాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. అలా చేయోద్దు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో అతను డోర్ వదిలిపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి తాప్సీ వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్ స్టాలో షేర్ చేయగా తెగ వైరలవుతుంది. తాప్సీ తీరుపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇండస్ట్రీలోకి మరో జయా బచ్చన్ వచ్చేసింది.. ఆమెకు అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాప్సీ ఇలా ఫోటోగ్రాఫర్లతో గొడవ పడడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఆమె నటించిన దొబెరా సినిమా ప్రమోషనల్లో ఫోటోగ్రాఫర్లకు.. తాప్సీకి మధ్య తీవ్రస్తాయిలో మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత ఇదే సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయంటూ ఓ విలేకరి అడగ్గా.. అతడిపై తాప్సీ మండిపడింది. మీతో ఎలా ప్రవర్తించిన నటీనటులను చెడు ప్రవర్తన కలిగిన వారు అనేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రతి సినిమాకు పాజిటివ్, నెగిటివ్ రివ్యూ ఉంటుందని తాప్సీ చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల హీరోయ ఆయుష్మాన్ ఖురానా నిర్వహించిన దీపావళి పార్టీలో సైతం తాప్సీ కెమెరామెన్స్ తో గొడవపడింది.

ఇవి కూడా చదవండి

చాలాకాలంగా తెలుగు ఇండస్ట్రీకి ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటుంది. మిషల్ ఇంపాజిబుల్ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది తాప్సీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌