Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Esmayeel Shroff: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… సీనియర్ డైరెక్టర్ మృతి.. దుఃఖంలో ఆ స్టార్ హీరో..

ఇస్మాయిల్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 80, 90 లలో ఇస్మాయిల్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అహిస్తా అహిస్తా, బులంది, తోడి సి బేవఫై, సూర్య వంటి సినిమాలను తెరకెక్కించారు.

Director Esmayeel Shroff: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం... సీనియర్ డైరెక్టర్ మృతి.. దుఃఖంలో ఆ స్టార్ హీరో..
Director Esmayeel Shroff
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2022 | 2:39 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ డైరెక్టర్ ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స్ పొందుతూ.. బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఇస్మాయిల్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 80, 90 లలో ఇస్మాయిల్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అహిస్తా అహిస్తా, బులంది, తోడి సి బేవఫై, సూర్య వంటి సినిమాలను తెరకెక్కించారు. వాస్తవానికి ఆయన పూర్తి పేరు ఎస్వీ ఇస్మాయిల్.. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇస్మాయిల్ ష్రాఫ్ అని పిలుస్తారు. బాలీవుడ్ స్టా్ర్ హీరో గోవిందా అగ్రకథానాయకుడిగా మారడంలో ఇస్మాయిల్ ముఖ్యపాత్ర పోషించారు.

ఆయన మృతి పట్ల హీరో గోవింద సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం లవ్ 86కి ఇస్మాయిల్ దర్శకత్వం వహించారు. నాకు చాలా బాధగా ఉంది.. ఆయనతోనే నా కెరీర్ మొదలైంది. ఆయన మాత్రమే నన్ను పూర్తిగా నమ్మారు. జీవితంలో నాకు సినిమాపై అవగాహన ఉందని చెప్పిన మొదటి వ్యక్తి ఆయనే. నన్ను గోవిందుడిగా మార్చడంలో ఆయనది కీలకపాత్ర ఉంది అంటూ భావోద్వేగానికి గురయ్యారు హీరో గోవిందా.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇస్మాయిల్ ఏపీలోని కర్నూలు జిల్లాలో పుట్టారు. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సినిమాలపై ఉన్న ఇష్టంతో ముంబై వచ్చి… బాలీవుడ్ డైరెక్టర్ భీమ్ సింగ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత అగర్ సినిమాతో దర్శకుడిగా మారారు. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, రాజ్ కుమార్ లతో సినిమాలను తెరకెక్కించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ట్రాజెడీ వంటి కమర్షియల్ చిత్రాలను రూపొందించారు. ఇస్మాయిల్ మృతి పట్ల బాలీవుడ్ తారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.