Janhvi kapoor: విజయ్‌కి ప్రాక్టికల్‌గా ఎప్పుడో పెళ్లి అయిపోంది.. జాన్వీ కపూర్‌ పెద్ద చర్చకే దారి తీసిందిగా..

నిత్యం వార్తల్లో ఉండే నటీమణుల్లో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఒకరు. అలనాటి అందాల తార శ్రీదేవీ నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, ఆచితూచి సినిమాలు చేసుకుంటూ వెళుతోందీ బ్యూటీ. ఇక నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ...

Janhvi kapoor: విజయ్‌కి ప్రాక్టికల్‌గా ఎప్పుడో పెళ్లి అయిపోంది.. జాన్వీ కపూర్‌ పెద్ద చర్చకే దారి తీసిందిగా..
Janhvi kapoor About Vijay devarakonda
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 27, 2022 | 3:52 PM

నిత్యం వార్తల్లో ఉండే నటీమణుల్లో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఒకరు. అలనాటి అందాల తార శ్రీదేవీ నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, ఆచితూచి సినిమాలు చేసుకుంటూ వెళుతోందీ బ్యూటీ. ఇక నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ, ఇంటర్వ్యూల్లోనూ తరుచుగా పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమె చేసే కొన్ని వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి చేయడంతో మరింత వైరల్‌గా మారాయి.

ఇంతకీ విషయమేంటంటే జాన్వీ కపూర్‌ నటిస్తోన్న తాచా చిత్రం మిలీ. నవంబర్‌ 4వ తేదీన ఈ సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీకి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘మీకు స్వయంవరం ఏర్పాటు చేస్తే పరిశ్రమ నుంచి ఏ ముగ్గురు హీరోలు అందులో పాల్గొనాలని కోరుకుంటున్నారు’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘రణ్‌బీర్‌, టైగర్’ అని చెప్పుకొచ్చింది. అయితే సదరు రిపోర్టర్‌ ప్రశిస్తూ.. ‘రణ్‌బీర్‌కు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆయన పేరు చెప్పకూడదు. సింగిల్‌ స్టేటస్‌లో ఉన్న స్టార్స్‌ పేర్లు చెప్పండి. విజయ్‌ దేవరకొండ గురించి ఏమంటారు’ అని ప్రశ్నించగా. ఆయనకు ఇప్పటికే ప్రాక్టికల్లీ పెళ్లి అయిపోంది అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.

జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ జాన్వీ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌ మీడియా అయితే ఏకంగా విజయ్‌, రష్మికల ప్రేమ వ్యవహారంపై కథనాలు ప్రచురిస్తోంది. కొన్ని రోజుల క్రితం విజయ్‌, రష్మికలు మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జాన్వీ చేసిన వ్యాఖ్యలను లింక్‌ చేస్తూ వార్తలు రాసేస్తున్నారు. మరి ఈ విషయంపై రౌడీ హీరో ఎప్పుడు అధికారికంగా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!