Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vignesh Shivan: సరోగసి వివాదంలో నయన్ దంపతులకు ఊరట.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన విఘ్నేష్ శివన్..

నయనతార దంపతులు అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చారంటూ వారిపై ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం.. పిల్లల జననం పై తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కమిటీని నియమించింది.

Vignesh Shivan: సరోగసి వివాదంలో నయన్ దంపతులకు ఊరట.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన విఘ్నేష్ శివన్..
Nayan, Vignesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2022 | 4:39 PM

లేడీ సూపర్ స్టార్ నయన్ దంపతులకు సరోగసి వివాదంలో ఊరట లభించింది. అనేక ట్విస్టుల తర్వాత వారిద్దరు ఎలాంటి చట్టాలని ఉల్లంఘించలేదని క్లీన్ చిట్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం. ఆరేళ్లు ప్రేమలో ఉన్న నయన్.. విఘ్నేష్ జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరికి అక్టోబర్ 9న కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తన్ ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేయడంతో సరోగసి అంశం తెరపైకి వచ్చింది. నయనతార దంపతులు అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చారంటూ వారిపై ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం.. పిల్లల జననం పై తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే తమకు చట్టబద్ధంగా ఆరేళ్ల క్రితమే పెళ్లి జరిగిందని చెప్పి షాకిచ్చారు నయన్ జంట. అంతేకాదు.. అందుకు తగిన ఆధారాలు కూడా చూపించారట.. ఇక కొద్ది రోజులు అద్దె గర్భం వివాదం పై విచారణ జరిపిన ప్రత్యేక బృందం… నయనతార, విఘ్నేష్ ఎలాంటి సరోగసి నిబంధనలు ఉల్లంఘించలేదంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో విఘ్నేష్.. తన ఇన్ స్టా వేదికగా మనసులోని మాటలను బయటపెట్టారు.

కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా వేదికగా సరోగసి వివాదం పై పరోక్షంగా స్పందిస్తున్నారు డైరెక్టర్ విఘ్నేష్. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు పట్ల ఓపికతో ఉండాలని గతంలో ఓ పోస్ట్ షేర్ చేశారు. తాజాగా ద్వేషం.. నెగిటివ్ విషయాలను వ్యాప్తి చేయడం.. మనశ్శాంతి గురించి ఆసక్తికర పోస్ట్స్ చేశాడు. ‘ఆరోగ్యం అనేది ఎప్పుడూ మెడిసిన్ వల్ల రాదు. చాలా వరకు మనశ్శాంతి అనేది.. హృదయంలో శాంతి, ఆత్మలో శాంతి నుంచి వస్తుంది. అలాగే నవ్వు, ప్రేమ నుంచి వస్తుంది’ అంటూ కోట్స్ షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

“ద్వేషాన్ని.. నెగిటివిటిని ఎంత తొందరగా వ్యాపిస్తుందో అంతే త్వరగా ప్రేమను పంచితో మనం జీవించే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో కదా ” అంటూ మరో కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసి పోస్ట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా తాము సరోగసి చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు రావడం పట్ల పరోక్షంగా విఘ్నేష్ స్పందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Nayanthara Vignesh

Nayanthara Vignesh

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.