Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: ఆరోజున ఓటీటీలో అలరించనున్న కాంతార ?.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఏమన్నారంటే..

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సామాన్యులే కాదు.. సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ముందుగా కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ప్రభంజనం సృష్టించింది.

Kantara: ఆరోజున ఓటీటీలో అలరించనున్న కాంతార ?.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఏమన్నారంటే..
Kantara Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2022 | 5:11 PM

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఓ చిన్న సినిమా సత్తా చాటుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ ఇప్పుడు రికార్డులను తిరగరాస్తోంది. భారీ వసూళ్లు రాబడుతూ భాషతో సంబంధం లేకుండా సౌత్ టూ నార్త్ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఆ 20 నిమిషాలు ప్రేక్షకుడి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ మైండ్‏లో తిరిగేస్తుంది. ఇందంతా ఏ మూవీ గురించో అర్థమయ్యే ఉంటుంది కదా. అదే కాంతార. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ అధిక వసూళ్ల కొల్లగొడుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సామాన్యులే కాదు.. సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ముందుగా కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆ చిత్ర సినిమాలు కాంతారను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. ఇక అన్ని భాషల్లోనూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ సెన్సెషన్ అయిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. థియేటర్లలో సూపర్ స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతున్న ఈ మూవీ ఓటీటీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరలవుతున్నాయి. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో నవంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ స్పందించారు. కాంతార సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. ఈ సినిమా నవంబర్ 4న ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం లేదని.. త్వరలోనే అధికారిక తేదీని ప్రకటిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

కర్ణాటక, కేరళ సరిహద్దులలో ఉండే ఆదివాసీల సాంప్రదాయ నృత్యమైన భూతకోల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఇందులో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలకపాత్రలలో నటించారు. కేజీఎఫ్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ రానుందని ఇటీవల హీరో రిషబ్ శెట్టి ప్రకటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.