RGV: రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం.. ఈసారి బయోపిక్ కాకుండా రియల్ పిక్.. అది కూడా 2 పార్ట్స్
మరోసారి పొలిటికల్ సీన్‌లోకి ఎంటరయ్యారు వర్మ. సీఎం జగన్‌ను కలిసి రెండు రోజులు గడవకుండానే రియల్ పిక్ అంటూ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అది కూడా రెండు పార్ట్స్‌గా రానుందట.
క్రేజీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. అడపాదడపా రాజకీయ ప్రాధాన్యమున్న సినిమాలు తీస్తూ.. సంచలనాలు సృష్టించే వర్మ… ఈసారి ఆ డోస్ మరింతగా పెంచేస్తూ మరో సినిమా అనౌన్స్ చేశారు. మూవీ పేరు వ్యూహం. ఏంటి మేస్టారూ… ఇది కూడా బయోపిక్కేనా అని అడక్కముందే… కాదుకాదు అంతకుమించి అంటూ తనదైన స్టయిల్‌లో ఆన్సరిచ్చేశారు. తన వ్యూహం సినిమా రెండు పార్టులుగా రాబోతోందని, దీనికి పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉందని క్లారిటీ ఇచ్చారు వర్మ. బయోపిక్‌లో అయినా అబద్దాలుండొచ్చు… రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళూ నిజాలే ఉంటాయంటున్నారు వర్మ. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిందే ఈ “వ్యూహం” కధ అంటున్నారు. గతంతో తాను తీసిన వంగవీటి మూవీ నిర్మించిన దాసరి కిరణ్ అనే వ్యక్తే దీనికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తారన్నారు. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక.. తాను దాని గురించి ఏం చెప్పట్లేదు అన్నారు వర్మ.
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది . రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .
ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
వ్యూహం సినిమాతో పొలిటికల్ షాక్ తప్పదని, దాన్నుంచి తేరుకునే లోపే శపధం అనే సినిమాతో ఎలక్ట్రిక్ షాక్ ఇస్తానన్నారు వర్మ. ఏపీ సీఎం జగన్‌తో భేటీ తర్వాత… వర్మ ఈ ప్రకటన చేయడంతో ఈ రెండు సినిమాలు ఎవరిని టార్గెట్‌గా చేసుకుని తీస్తారు అనే చర్చ షురూ అయింది. ఇప్పటికే… చంద్రబాబు, వంగవీటి రంగా, పరిటాల రవి, లక్ష్మీపార్వతి, పవన్‌కల్యాణ్ సెంట్రిక్‌గా పొలిటికల్ సినిమాలు చేసి ఏపీ పాలిటిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ.
వర్మ ఏది చేసినా సెన్సేషనే. సినిమా కోసం.. దాని ప్రమోషన్ కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఎంతదూరమైనా వెళ్తారు. జడ్జ్ చేయలేని ఓ టిపికల్ క్యారెక్టర్ ఆయనది. మరి ఈ సినిమా ద్వారా ఆర్జీవీ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు..? రియల్ పిక్ అంటున్నారు కాబట్టి.. ఎలాంటి రియల్ ఇన్సిడెంట్స్ టచ్ చేస్తారు అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..