Rajinikanth: రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ రేసులో సూపర్ స్టార్ ?..
రజినీ చివరిసారిగా అన్నాత్తే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నెల్సన్... రజినీ కాంబోలో వ చ్చే సినిమా కామెడీ, యాక్షన్ డ్రామాగా ఉండనుందని.. ఇందులో ప్లాష్ బ్యాక్ సమయంలోని పలు సన్నివేశాల్లో మిల్కీబ్యూటీ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా, కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ అతిథి పాత్రలలో మెరవనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం రజినీ ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. వీలైనంత తొందరగా ఈ మూవీ చిత్రీకరణ కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. దీంతో యంగ్ హీరోలకు పోటీగా సమ్మర్ రేసులో సూపర్ స్టార్ తలైవా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రజినీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
రజినీ చివరిసారిగా అన్నాత్తే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నెల్సన్… రజినీ కాంబోలో వ చ్చే సినిమా కామెడీ, యాక్షన్ డ్రామాగా ఉండనుందని.. ఇందులో ప్లాష్ బ్యాక్ సమయంలోని పలు సన్నివేశాల్లో మిల్కీబ్యూటీ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.




అయితే సూపర్ స్టార్ అనారోగ్య కారణాల వల్ల జైలర్ చిత్రీకరణ కొద్దిరోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రజినీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నెల్సన్ టీం భావిస్తుందని.. ప్రస్తుతం అందుకు సన్నాహాలు చేస్తు్న్నారని టాక్. అయితే థియేటర్లలో జైలర్ సందడి చేసే రోజు పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.