Parvathy Thiruvothu : ప్రెగ్నెంట్ అంటూ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరోయిన్.. అయోమయంలో నెటిజన్స్..
పార్వతికి ఎప్పుడు మ్యారెజ్ అయ్యింది ?.. ప్రెగ్నెంట్ కిట్ ఎందుకు షేర్ చేసింది ? అంటూ సందేహాలు వ్యక్చం చేస్తుండగా.. మరికొందరు మాత్రం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పార్వతి తిరువోతు.. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. పార్వతి షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం తన ఇన్ స్టా ఖాతాలో ప్రెగ్నెంట్ టెస్ట్ కిట్ షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. అంతేకాదు.. అద్భుతం ప్రారంభమైందంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పార్వతికి ఎప్పుడు మ్యారెజ్ అయ్యింది ?.. ప్రెగ్నెంట్ కిట్ ఎందుకు షేర్ చేసింది ? అంటూ సందేహాలు వ్యక్చం చేస్తుండగా.. మరికొందరు మాత్రం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వాస్తవానికి పార్వతి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పటి వరకు బయటపెట్టలేదు. ఆమె ప్రేమ, పెళ్లి గురించి ఎలాంటి వార్తలు వినిపించలేదు. ప్రస్తుతం పార్వతి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది.
అయితే పార్వతి తన తదుపరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్.. పార్వతి ఒకేసారి ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేయడంతో వీరు ఓకే సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిత్యా, పార్వతి ఒకే ప్రాజెక్ట్ లో కనిపించనున్నారని.. తమ మూవీ ప్రచారం కోసం ఇలా షేర్ చేసినట్లుగా సమాచారం. వీరి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్వతి చివరిసారిగా మమ్ముట్టి నటించిన పుజు చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ సోనీలైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాకుండా.. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తంగలన్, ఉల్లోజుక్కు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.




మరోవైపు నిత్యామీనన్.. వెండితెరపైనే కాదు ఓటీటీలోనూ అలరిస్తోంది. ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోలో న్యాయనిర్ణేతగా మెప్పించింది నిత్యా. ఇక తెలుగు, తమిళంలోనూ స్టార్ హీరో ధనుష్ సరసన తిరు చిత్రంలో కనిపించింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.