AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య తొలి కమర్శియల్ యాడ్ చూశారా ?.. అదరగొట్టిన నందమూరి హీరో..

బాలకృష్ణ నటించిన రెండు కమర్షియల్ యాడ్స్ విడుదలయ్యాయి. రెండు యాడ్ల కాన్సెప్ట్‌ లు యునిక్ గా ఆకర్షణీయంగా వున్నాయి. బాలకృష్ణ రెండు విభిన్న గెటప్‌లలో మెరిశారు. సూట్ ‌లలో క్లాస్ అప్పియరెన్స్, కుర్తా పైజామాలో సాంప్రదాయకంగా కనిపించి ఆకట్టుకున్నారు.

Balakrishna: బాలయ్య తొలి కమర్శియల్ యాడ్ చూశారా ?.. అదరగొట్టిన నందమూరి హీరో..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2022 | 6:33 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు సరికొత్త దారిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు వెండితెరపై సందడి చేసిన బాలయ్య.. కొద్దిరోజులుగా ఓటీటీలో యాంకర్‏గా మరో కోణాన్ని పరిచయం చేశారు. ఇక ఇప్పుడు కెరీర్‏లోనే మొదటిసారి కమర్షియల్ యాడ్ చేస్తున్నారు. బాలకృష్ణ తన తొలి బ్రాండ్ కమర్షియల్‌ తో అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తన స్టార్ ‌డమ్‌ కి తగ్గ బ్రాండ్‌ ని ఎంచుకున్నారు. సాయి ప్రియా గ్రూప్ వెంచర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్- 116 పారామౌంట్‌ కి బ్రాండ్ అంబాసిడర్‌ గా ఆమోదం తెలిపారు బాలయ్య. సాయి ప్రియా గ్రూప్ సౌత్ ఇండియా బెస్డ్ నిర్మాణ, ప్లాటింగ్ సేవల అందించే విభిన్న మార్కెట్ విభాగాలలో ప్రముఖ బిల్డర్. వారు అందించే రీగల్ శ్రేణి ప్రాజెక్ట్‌లకు సరిపోయేలా, వారు తమ బ్రాండ్‌ ను ఎండోర్స్ చేయడానికి లయన్ నందమూరి బాలకృష్ణను తీసుకున్నారు.

బాలకృష్ణ నటించిన రెండు కమర్షియల్ యాడ్స్ విడుదలయ్యాయి. రెండు యాడ్ల కాన్సెప్ట్‌ లు యునిక్ గా ఆకర్షణీయంగా వున్నాయి. బాలకృష్ణ రెండు విభిన్న గెటప్‌లలో మెరిశారు. సూట్ ‌లలో క్లాస్ అప్పియరెన్స్, కుర్తా పైజామాలో సాంప్రదాయకంగా కనిపించి ఆకట్టుకున్నారు. మొదటి యాడ్‌లో బాలకృష్ణ రాయల్ అవతార్ లో కనిపిస్తుండగా, రెండో యాడ్‌లో సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించారు. రెండూ చాలా మంచి కాన్సెప్ట్స్, అందరిదృష్టిని ఆకర్షించాయి. ఇండియన్స్ ఇల్లు కొనడం చాలా పెద్ద నిర్ణయం. నివాస గృహాన్ని కొనుగోలనేది చాలా భావోద్వేగాలు, సెంటిమెంట్ తో కూడుకున్నది. రెండవ ప్రకటన ద్వారా ఇదే విషయాన్ని తెలియజేశారు. బాలకృష్ణ తనదైన డైలాగ్ డెలివరీతో చాలా గ్రేస్‌ ఫుల్ గా ఆకట్టుకున్నారు. బాలకృష్ణ కూతురుగా బేబీ ఆదిశ్రీ గండ్ర కనిపించింది. ఆనంద్ గుర్రాన్ రెండు వాణిజ్య ప్రకటనలకు రచన, దర్శకత్వం వహించగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. శ్రేయాస్ మీడియా Brand’E సహకారంతో ఈ కమర్షియల్ యాడ్స్ ని సమన్వయం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.