AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఓవైపు మెగా పవర్.. మరోవైపు మాస్ మాహారాజా.. ఇక అభిమానులకు పూనకాలే..

చిరంజీవి, రవితేజ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు, భారీ సెట్‌ లో చిత్రీకరించిన మాస్ నంబర్ లో వీరిద్దరినీ చూడటం అభిమానులకు కన్నుల పండగ కానుంది. మెగా మాస్ విందును బిగ్ స్క్రీన్‌ లపై చూసేందుకు అభిమానులు, సినీ ప్రేమికులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

Megastar Chiranjeevi: ఓవైపు మెగా పవర్.. మరోవైపు మాస్ మాహారాజా.. ఇక అభిమానులకు పూనకాలే..
Waltair Veerayya Movie Upda
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2022 | 6:58 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిరంజీవి, రవితేజలపై మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. చిరంజీవి, రవితేజ గ్రేస్ ఫుల్ మూవ్స్, ఎనర్జీతో అలరించేలా మాస్ డ్యాన్స్ నంబర్‌ ను ట్యూన్ చేశారు. శేఖర్ మాస్టర్ అద్భుతంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. చిరంజీవి, రవితేజ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు, భారీ సెట్‌ లో చిత్రీకరించిన మాస్ నంబర్ లో వీరిద్దరినీ చూడటం అభిమానులకు కన్నుల పండగ కానుంది. మెగా మాస్ విందును బిగ్ స్క్రీన్‌ లపై చూసేందుకు అభిమానులు, సినీ ప్రేమికులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి వింటేజ్ అవతార్‌ లో కనిపించిన ఈ సినిమా టైటిల్ టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ అందరికి పూనకాలు తెప్పించింది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతుంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!