Abhishek Agarwal: మరోసారి మంచి మనసు చాటుకున్న కార్తికేయ2 నిర్మాత.. కేంద్రమంత్రి స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న అభిషేక్‌

కరోనా ఆపత్కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిషేక్‌ తాజాగా ఓ గ్రామాన్ని బాగు చేసేందుకు నడుం బిగించారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఇది కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్వగ్రామం కావడం గమనార్హం.

Abhishek Agarwal: మరోసారి మంచి మనసు చాటుకున్న కార్తికేయ2 నిర్మాత.. కేంద్రమంత్రి స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న అభిషేక్‌
Abhishek Agarwal
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2022 | 11:07 AM

ది కశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ2 సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకున్నాడు ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌. ఈ చిత్రాలతో భారీ లాభాలు ఆర్జించిన ఆయన మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా ఆపత్కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిషేక్‌ తాజాగా ఓ గ్రామాన్ని బాగు చేసేందుకు నడుం బిగించారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఇది కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్వగ్రామం కావడం గమనార్హం. అభిషేక్‌కు, కేంద్ర మంత్రికి మధ్య మంచి అనుబంధం ఉంది. పలు వేడుకలు, ఫంక్షన్లలో చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. కాగా ఇప్పటికే చంద్రకళ ఫౌండేషన్‌ను స్థాపించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారీ ఫిల్మ్‌ మేకర్‌. ఈనేపథ్యంలో తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు అభిషేక్‌. చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివాస్ అక్టోబర్ 30న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

కాగా స్వతహాగా వ్యాపారవేత్త అయిన అభిషేక్‌ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటగా మహేశ్‌ బ్రహ్మోత్సవం సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆతర్వాత నిఖిల్‌ కిర్రాక్‌ పార్టీ, అడవిశేశ్‌ గూఢచారి, బెల్లంకొండ శ్రీనివాస్‌ సీత సినిమాలకు కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆతర్వాత సందీప్‌ కిషన్‌ ఎ1 ఎక్స్‌ప్రెస్ తో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. ఆపై శ్రీ విష్ణు రాజ రాజ చోర, ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను తెరకెక్కించి మంచి అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకన్నారు. ప్రస్తుతం ఆయన మాస్‌ మహారాజాతో కలిసి టైగర్ నాగేశ్వరరావు సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్‌ దశలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..