Optical Illusion: పచ్చని చెట్లతో నిండిపోయిన ఈ పార్క్‌లో ఓ బల్లి దాక్కొని ఉంది.. 10 సెకన్లలో కనిపెట్టగలరేమో ట్రై చేయండి

వినోదంతో పాటు, ఆలోచన శక్తి, సామర్థ్యం, సహనం పెంపొందించుకోవడంలో ఇవి బాగా సహాయపడతాయి. మెదడు పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి. చాలా మంది ఆప్టికల్ ఇల్యూజన్ ఛాలెంజ్‌ను స్వీకరించి పరిష్కరిస్తుంటారు.

Optical Illusion: పచ్చని చెట్లతో నిండిపోయిన ఈ పార్క్‌లో ఓ బల్లి దాక్కొని ఉంది.. 10 సెకన్లలో కనిపెట్టగలరేమో ట్రై చేయండి
Optical Illusion
Follow us

|

Updated on: Oct 29, 2022 | 1:20 PM

ఆప్టికల్ ఇల్యూషన్‌.. మెదడుతో పాటు కళ్లకు పనిచెప్పే ఈ పజిల్స్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ ఫొటో పజిల్స్‌ను పరిష్కరించేందుకు బాగా ఆసక్తి చూపిస్తుండడంతో రోజురోజుకు వీటి క్రేజ్‌ పెరిగిపోతోంది. ఇక ఇలాంటి వెరైటీ పజిల్స్‌ పిల్లల్లో IQ ను పెంచుతాయంటున్నారు నిపుణులు. వినోదంతో పాటు, ఆలోచన శక్తి, సామర్థ్యం, సహనం పెంపొందించుకోవడంలో ఇవి బాగా సహాయపడతాయి. మెదడు పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి. చాలా మంది ఆప్టికల్ ఇల్యూజన్ ఛాలెంజ్‌ను స్వీకరించి పరిష్కరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో పజిల్ ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో దట్టమైన పచ్చని చెట్ల మధ్య ఓ బల్లి దాగుంది. దానిని కనుగొనేందుకు 10 సెకన్ల సమయం ఇచ్చారు. అయితే 99 శాతం మంది ఈ ఫజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోయారు. 20 సెకన్లు ఇచ్చినా ఫెయిల్‌ అయ్యారు.

కొంచెం గందరగోళంతో కూడుకున్న ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేయడం కొంచెం కష్టమే. అయితే కాస్తా ఓపిక తెచ్చుకుంటే అసాధ్యమేమీకాదు. కాస్త కళ్లను పెద్దవిగా చేసుకుని చూస్తే ఈజీగా ఈ ఫొటో పజిల్‌ను పరిష్కరించవచ్చు. ఇప్పటికీ బల్లి కనిపించకపోతే మీకు ఒక క్లూ.. ఫై ఫొటోలో ఎడమ వైపున ఉన్న మొక్కలను కాస్త తీక్షణంగా చూడండి. ఫొటో పై భాగంలో ఒక కొమ్మ బయటకు పొడుచుకువచ్చింది. అక్కడే నీలిరంగులో దాగున్న బల్లి దాక్కొని ఉంది. ఇప్పటికీ బల్లిని కనిపించకపోతే కింది ఫొటోను చూడండి.

Optical Illusion 1

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..