Hamida Khatoon: మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు కొన్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ధర ఎంతో తెలుసా?

దీపావళి పండగను పురస్కరించుకుని కొత్త కారు కొనుక్కుంది హమీదా. ఖరీదైన మెర్సిడిస్‌ బెంజ్‌ కారును తన ఇంటికి తెచ్చుకున్న ఆమె.. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మురిసిపోయింది.

Hamida Khatoon: మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు కొన్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ధర ఎంతో తెలుసా?
Hamida, Anchor Ravi
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2022 | 12:19 PM

బిగ్‌బాస్‌ రియాల్టీషోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో హమీదా కాతూన్‌ ఒకరు. అంతకుముందు సాహసం చేయరా ఢింబకా అనే ఓ తెలుగు సినిమాతో పాటు ఓ తమిళ్‌ మూవీలోనూ తళుక్కుమన్న ఈ అందాల తారకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్‌-5 లో అడుగుపెట్టిందో ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగిపోయింది. హౌస్‌లో ఫేమస్‌ సింగర్‌ శ్రీరామచంద్రతో ఆమె నడిపిన లవ్‌ ట్రాక్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే యాంకర్‌ రవితో చేసిన సందడి అంతా ఇంతాకాదు. ఇదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లోనూ హడావిడి చేసింది. ఇదిలా ఉంటే దీపావళి పండగను పురస్కరించుకుని కొత్త కారు కొనుక్కుంది హమీదా. ఖరీదైన మెర్సిడిస్‌ బెంజ్‌ కారును తన ఇంటికి తెచ్చుకున్న ఆమె.. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మురిసిపోయింది. ఇందులో తన కుటుంబంతో పాటు యాంకర్‌ రవి, అతడి భార్య నిత్య సక్సేనా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక హమీదా పోస్టుకు శ్రీరామ్ కంగ్రాట్స్ అని కామెంట్ పెట్టాడు. దీనికి ‘థాంక్యూ’ అని రిప్లై ఇచ్చిందీ బిగ్‌బాస్‌ బ్యూటీ.

కాగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా హమీదా, యాంకర్‌ రవి, శ్రీరామచంద్ర, సిరి కలిసిమెలిసే ఉంటున్నారు. ఇక హమీద అయితే ఎక్కువగా రవి ఫ్యామిలీతోనే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హమీద కొన్న కొత్త కారు గురించి రవి కూడా ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ షేర్‌ చేశాడు. ‘వెల్‌కమ్‌ టు ది బీస్ట్.. హమీద కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది.. నీ కొత్త ప్రాజెక్ట్‌లకు ఆల్ ది బెస్ట్.. దయచేసి జాగ్రత్తగా డ్రైవ్ చేయ్’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తామంతా కొత్త కారును ఎలా ఓపెన్ చేశారో చూపించాడు. అలాగే ఫస్ట్ రైడ్‌ అనుభవాలను పంచుకున్నాడు. కాగా ఈ కారు విలువ కనిష్టంగా రూ.యాభై లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్