IND vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డ స్టార్ ప్లేయర్
వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ దినేష్ కార్తీక్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. డైవింగ్ చేస్తూ క్యాచ్ తీసుకుంటున్న సమయంలో కార్తీక్ చేతికి గాయం కావడంతో నొప్పితో మైదానంలో కూర్చుండిపోయాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య హైవోల్టేజ్ పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. సెమీ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో పెర్త్ స్టేడియంలో ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే అగ్రస్థానం నిలబెట్టుకోవడంతో పాటు సెమీస్‌కు మార్గం మరింత సుగమం అవుతుంది. అదే సమయంలో సఫారీలు గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకోవడంతో పాటు టీమిండియా కిందకు పడిపోతుంది. ఇలా అనేక కారణాల వల్ల నేటి మ్యాచ్ చాలా కీలకంగా మారింది. అయితే అంతకుముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఆఫ్రికాతో మ్యాచ్‌కు ముందు పెర్త్ స్టేడియంలో భారత జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ దినేష్ కార్తీక్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. డైవింగ్ చేస్తూ క్యాచ్ తీసుకుంటున్న సమయంలో కార్తీక్ చేతికి గాయం కావడంతో నొప్పితో మైదానంలో కూర్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
పంత్ కు ఛాన్స్ !
అయితే డీకేకు పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే మ్యాచ్లో ఆడతాడా? లేదా? అన్న దానిపై కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. ఒక వేళ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి డీకే తప్పుకుంటే రిషబ్ పంత్‌కు అవకాశం దక్కుతుంది. మరోవైపు రెండు వరుస విజయాల తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మార్పు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడడం ఖాయం. కోహ్లి వన్‌డౌన్‌లో, సూర్యకుమార్ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. హార్దిక్ ఐదో స్థానంలో ఆడనున్నాడు. కార్తీక్ లేదా పంత్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ బదులుగా మరో ఆల్ రౌండర్ దీపక్ హుడాకు అవకాశం దక్కవచ్చు. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ ప్లేస్ లో యుజువేంద్ర చాహల్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. ఎలాగూ భువీ, షమీ, అర్ష్‌దీప్‌లు జట్టులో ఉంటారు.
Dinesh Karthik in pain after taking a diving catch during practice session. Don’t worry, nothing serious here. Karthik was soon back taking few more catches in the session.
?: @pdevendra pic.twitter.com/jInPeP6JlS
— Express Sports (@IExpressSports) October 29, 2022
సీఎం కేసీఆర్ బహిరంగ సభ లైవ్ దిగువన చూడండి…