AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WORLD CUP 2022: సౌతాఫ్రికాతో భారత్ మ్యాచ్.. అందరి దృష్టి కోహ్లీ పైనే.. పలు రికార్డులకు అడుగు దూరంలో..

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో అందరిదృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. సూపర్ -12లో భారత్ పాకిస్తాన్ తో ఆడిన తొలి మ్యాచ్ లో అద్భుత నాక్ ఆడి అందరి ప్రశంసలు అందుకున్న కింగ్ కోహ్లీ, నెదార్లాండ్ తో జరిగిన..

T20 WORLD CUP 2022: సౌతాఫ్రికాతో భారత్ మ్యాచ్.. అందరి దృష్టి కోహ్లీ పైనే.. పలు రికార్డులకు అడుగు దూరంలో..
Virat Kohli
Amarnadh Daneti
|

Updated on: Oct 30, 2022 | 1:07 PM

Share

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో అందరిదృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. సూపర్ -12లో భారత్ పాకిస్తాన్ తో ఆడిన తొలి మ్యాచ్ లో అద్భుత నాక్ ఆడి అందరి ప్రశంసలు అందుకున్న కింగ్ కోహ్లీ, నెదార్లాండ్ తో జరిగిన రెండో మ్యాచ్ లో సైతం అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక సూపర్ 12లో గ్రూప్ 2నుంచి భారత్- దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడబోతున్నాయి. ఈ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు విరాట్ కోహ్లీ. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై అర్ధశతకాలతో సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు కోహ్లీ. పాకిస్తాన్‌పై 82 పరుగులు చేయడగా, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆదివారం ఆడబోయే మ్యాచ్‌కి ముందు కోహ్లీ పలు రికార్డులకు అడుగు దూరంలో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో గనుక 28 పరుగులు చేయగలిగితే టీ20 ప్రపంచకప్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు కింగ్ కోహ్లీ.

టీ20 ప్రపంచకప్‌లన్నింటిలో ఇప్పటివరకు 989 పరుగులు చేసిన కోహ్లి, టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగుల స్కోరర్‌గా అవతరించడానికి మరో 28 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 1016 పరుగులతో ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాపై 11 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే, టీ20 ప్రపంచకప్‌లలో జయవర్ధనా తర్వాత వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. 33 ఏళ్ల విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడి.. 12 ఆఫ్ సెంచరీలతో 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు.

ఆసియా కప్ లో భాగంగా గత నెలలో ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి తన తొలి టీ20 సెంచరీని నమోదు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తో కోహ్లీ ఆడిన అద్భుత నాక్ పై ఇప్పటికే ఎంతో మంది ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..