Andhra Pradesh: టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్.. సోషల్ మీడియాలో ఆడియో వైరల్

పట్టాభి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తాను సీఏం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశానో ఏమి తెలియకుండా..

Andhra Pradesh: టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్.. సోషల్ మీడియాలో ఆడియో వైరల్
Rangopal Varma, TDP Leader Pattabhi
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 29, 2022 | 12:22 PM

మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలవడం, తాను వ్యూహాం సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రాంగోపాల్ వర్మపై టీడీపీ, జనసేన పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సందర్భంగా సీఏం జగన్మోహన్ రెడ్డి, రాంగోపాల్ వర్మ భేటీపై టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తుల గురించి తాము మాట్లాడి.. టైమ్ వేస్ట్ చేసుకోదల్చుకోలేదని, అతడొక ఫ్లాప్ డైరెక్టర్ అని విమర్శించారు. రామ్ గోపాల్ వర్మ గురిచి మట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోబోమన్నారు. ఓ ప్లాప్ డైరెక్టర్ ను పక్కన పెట్టుకుని సినిమా తీయించుకుని ఓట్లు సంపాదించుకోవాలనుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారారని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మను దొడ్డి దారిన పిలిపించుకున్నారని విమర్శించారు. నేడు సినీ ఫీల్డ్ లో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటో రేపు పొలిటికల్ ఫీల్డ్ లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదేనని విమర్శించారు.

పట్టాభి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తాను సీఏం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశానో ఏమి తెలియకుండా పట్టాభి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. రసుగుల్లా స్వీట్ లా ఉండే పట్టాభి మిరపకాయలా ఫీల్ అయ్యి ఎలా పడితే అలా మాట్లాడి హైరానా పడితే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని, కొద్దిగా కూల్ గా ఉండాలంటూ హితవు పలికారు. పట్టాభికి సలహా ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని, అయితే ప్రజలకు పట్టాభితో ఎటువంటి అవసరం లేదని, వారి కుటుంబ సభ్యులకు ఉంటే ఉండొచ్చని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇదే సందర్భంలో రసుగుల్లా స్వీటు అంటే తనకు ఇష్టమని, ఆ స్వీటు లా ఉండే పట్టాభి తనకు నచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పట్టాభి పై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కలిశారు. ఆ తర్వాత ఆయన వ్యూహాం అనే సినిమా తీయబోతున్నానని, సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సినిమా తీయాలనుకుంటున్నారంటే టీడీపీ, జనసేన పార్టీలు కొద్దిరోజులుగా విమర్శిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..