T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో భారత్ జోరు.. టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

ఆసియా కప్ లో ఓటమి తర్వాత టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ప్రత్యర్థి ఎవరైనా విజయమే లక్ష్యంగా ఆడుతోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ ను ఎలాగైనా గెలవాలనే కసితో ఆడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు..

T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో భారత్ జోరు.. టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
ప్రపంచ క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు చేసిన రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడని టీమిండియా మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 30, 2022 | 1:31 PM

ఆసియా కప్ లో ఓటమి తర్వాత టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ప్రత్యర్థి ఎవరైనా విజయమే లక్ష్యంగా ఆడుతోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ ను ఎలాగైనా గెలవాలనే కసితో ఆడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో గెలిచి తన సత్తా చాటిన టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుతంగా ఆడిన టీమిండియా..రెండో మ్యాచ్ లో పసికూన నెదర్లాండ్స్‌పై కూడా దుమ్మురేపింది. ఈ సారి టైటిల్‌పై గురిపెట్టిన భారత్.. టోర్నీకి 18 రోజుల ముందుగానే ఆస్ట్రేలియాకు చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా మైదానాల్లో ప్రాక్టీస్ చేసిన భారత్ అక్కడి మైదానాలకు అలవాటు పడింది. దీంతో ఏ మ్యాచ్ లో ఎలా ఆడాలో భారత ఆటగాళ్లు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సూపన్ 12లో తన మూడో మ్యాచ్ దక్షిణాఫ్రికాపై ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ భారత క్రికెట్ జట్టు సన్నద్ధత పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సారి టీమిండియా సన్నద్ధత అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆస్ట్రేలియాలోని మైదానాల్లో ప్రాక్టీస్ చేసి.. అక్కడి పిచ్ లకు అలవాటు పడటం వల్ల టీమిండియా మంచి బౌన్స్ రాబట్టిందని, అలాగే మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ కూడా భారత్ కు కలిసి వస్తుందని వాస్కర్ తెలిపారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ లో భారత్ పైచేయి సాధిస్తు్ందని ముందే ఊహించామని, రెండో మ్యాచ్ లో నెదార్లాండ్ పై కూడా సత్తా చాటి విజయం సాధించారని గవాస్కర్ తెలిపారు.

తన మూడో మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడనున్న నేపథ్యంలో.. సౌతాఫ్రికా జట్టులో ఇద్దరు బ్యాట్స్ మెన్ ఫామ్ లో లేరని ఇదే సమయంలో టీమిండియా బౌలింగ్ అటాక్ ను కలిగి ఉందని గవాస్కర్ తెలిపారు. ప్లాన్ ప్రకారం ఆడితే సౌతాఫ్రికాపై కూడా పై చేయి సాధించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గవాస్కర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..