Winter Tips: శీతాకాలంలో గుండెపోటు బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా?
గుండెపోటు ఏ సీజన్‌లోనైనా, ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే శీతాకాలంలో మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో వింటర్ సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇతర సీజన్లతో పోల్చితే శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సీజన్‌లో సంభవించే వాతావరణ మార్పులతో చర్మ సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే చాలామందికి ఈ విషయాలపై అవగాహన లేదు. ముఖ్యంగా గుండెకు వచ్చే ప్రమాదాల గురించి ఎవరికీ తెలియదు. ప్రపంచంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల వల్ల సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా శీతాకాలంలో విపరీతమైన చలి కారణంగా చాలామంది గుండెపోటుకు గురువుతున్నారు. సాధారణంగా మన గుండె కండరాలకు సహజసిద్ధమైన రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండెపోటు ఏ సీజన్‌లోనైనా, ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే శీతాకాలంలో మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో వింటర్ సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
శీతాకాలంలో బారోమెట్రిక్ పీడనం, తేమ, గాలి, చల్లని గాలులు శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటి కారణంగానే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక శీతాకాలంలో చాలామందికి నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు తలెత్తుఆయి. రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఈ కారకాలన్నీ రక్తపోటు, చివరకు గుండెపోటుకు దారి తీస్తాయి.
గుండెపోటు ప్రమాదాన్ని పెంచే 5 తప్పులు
దుస్తులు
శీతాకాలంలో, శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రత్యేక దుస్తులు ధరించాలి. ముఖ్యంగా మన శరీరం మరీ చల్లగా ఉన్నప్పుడు నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి కాలానుగుణంగా మన దుస్తులు ఉండాలని నిపుణులు సూచిస్తారు. అలాగనీ శరీరానికి అసౌకర్యం కలిగించే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించవద్దు.
వ్యాయామం
చలి ఎక్కువగా ఉందని శీతాకాలంలో చాలామంది వ్యాయామాన్ని పక్కన పెడతారు. గుండె ఆరోగ్యకరమైన హృదయ వ్యాయామాలు, ముఖ్యంగా సైక్లింగ్, చురుకైన నడక, పరుగు, జాగింగ్ మొదలైన వాటిని చేర్చుకోవాలి. అయితే ఈ విషయంలో ఫిట్‌నెస్ నిపుణుల సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలి. అలాగే పండుగ రోజుల్లో మద్యానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శీతాకాలంలో మద్యం సేవించడం చాలా ప్రమాదం. ఆల్కహాల్ శరీరాన్ని వేడి చేస్తుందనేది అబద్ధం. ఆల్కహాల్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల, గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్న శీతాకాలంలో అధికంగా మద్యం సేవించడం ప్రాణాంతకం.
ఉదయాన్నే వాకింగ్ వద్దు..
గతంలో గుండెపోటు వచ్చిన వారు ఉదయాన్నే నిద్ర లేవకూడదు. దీని కారణంగా, చల్లని రక్త నాళాలు కుంచించుకుపోతాయి, శరీరం వేడెక్కడానికి చాలా కష్టపడాలి. ఈ సమయంలో మన గుండెపై ఒత్తిడి పెరగుతుంది. చివరకు ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.
ఉప్పు తగ్గించండి
మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్‌కు గురవుతుంది. దీనివల్ల రక్తప్రసరణకు ఇబ్బందిగా మారుతుంది. క్రమంగా ఇది గుండెపోటుకు దారి తీస్తుంది. అలాగే వేయించిన పదార్థాలను దూరంగా ఉంచాలి.
ఇది కూడా చదవండి..
అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. తారకరాముడి స్పందనేంటి?.. ‘రజనీతో రామ్’.. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్..