AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava: ఆరోగ్యంపై టెన్షన్ ఎందుకు దండగా.. జామ పండు ఉండగా.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వీటిని రోజూ తింటే.. పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి పండ్లలో జమ పండు ముందు వరుసలోనే ఉంటుంది.

Guava: ఆరోగ్యంపై టెన్షన్ ఎందుకు దండగా.. జామ పండు ఉండగా.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Guava Health Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 30, 2022 | 1:01 PM

పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వీటిని రోజూ తింటే.. పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి పండ్లలో జమ పండు ముందు వరుసలోనే ఉంటుంది. జామపండును పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. జామకాయను కోసి దాని ముక్కలకు నల్ల ఉప్పు, కొంచెం మిర్చి అద్ది తింటే ఆ మజానే వేరేలా ఉంటుంది. రుచి పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా జామ ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియం వంటి పోషకాలు జామపండులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనిని ప్రతిరోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే, జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: కడుపు నొప్పితో బాధపడుతున్నా లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే ప్రతిరోజూ ఒక జామపండు తినడం మంచిది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు ఉదయాన్నే కడుపు కూడా సులభంగా శుభ్రం అవుతుంది.
  2. గుండె సమస్యలు దూరం: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జామపండును ఆహారంలో చేర్చుకోవాలి. జామకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  3. ఆరోగ్యకరమైన చర్మం కోసం: ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా జామ పండు చాలా మేలు చేస్తుంది. జామలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
  4. బరువు తగ్గేలా చేస్తుంది: ఎక్కువ ఆకలిగా అనిపించినా లేదా తీపి ఆహారం తినాలన్న కోరిక ఉంటే జామపండు తినడం ప్రారంభించండి. దీన్ని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉండి ఏమీ తినాలని అనిపించదు. దీంతో మీకు చిరుతిండి కోరికలు కూడా దూరమై.. బరువు నియంత్రణలో ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. యాక్టివ్‌గా ఉంచుతుంది: మీకు మార్నింగ్ సిక్‌నెస్ ఉంటే.. కచ్చితంగా జామపండు తినాలి. దీని కారణంగా మీ శరీరం చురుకుగా మారుతుంది. ఇది మానసిక స్థితిని కూడా చక్కగా ఉంటుంది. చురుకుగా ఉండటానికి, ఇతర పండ్లతో పాటు జామ పండ్లను కూడా రెగ్యులర్ గా తినండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి