డైనింగ్ టేబుల్‌పై ఎప్పుడూ ఉండే ఈ పదార్థాలు మీ ఆరోగ్యానికి పెను ముప్పు.. పక్కన పెట్టకపోతే ప్రమాదంలో పడినట్లే

ఉదయం అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా ఉండాల్సిందే. చాలామంది రుచి సరిపోలేదనో, ఇతర కారణాలతో భోజనం మధ్యలో ఉప్పు కలుపుకోవడం పరిపాటిగా మారింది.

డైనింగ్ టేబుల్‌పై ఎప్పుడూ ఉండే ఈ పదార్థాలు మీ ఆరోగ్యానికి పెను ముప్పు.. పక్కన పెట్టకపోతే ప్రమాదంలో పడినట్లే
Diet Tips
Follow us

|

Updated on: Oct 30, 2022 | 1:48 PM

మన డైనింగ్ టేబుల్‌పై నిత్యం కొన్ని పదార్థాలు తప్పనిసరిగా ఉంచుతాం. మనం తినే ఆహార పదార్థాల్లో రుచిని పెంచడానికి వీటిని ఉపయోగిస్తాము. అయితే ఆహార రుచిని పెంచే ఇవే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి . వీటిని మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల పలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే డిన్నర్ లేదా డైనింగ్‌ టేబుల్‌పై ఈ పదార్థాలు ఉంటే వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేయండి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది. ఇది ఆహార పదార్థాల రుచిని రెట్టింపు చేస్తుంది. అందుకే ఉదయం అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు – డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా ఉండాల్సిందే. చాలామంది రుచి సరిపోలేదనో, ఇతర కారణాలతో భోజనం మధ్యలో ఉప్పు కలుపుకోవడం పరిపాటిగా మారింది. అధిక ఉప్పు వల్ల మన శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. శరీరంలోని సోడియం మొత్తం రక్తపోటును అధికంగా నియంత్రిస్తుంది. దీని వల్ల హార్ట్ స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

కెచప్ అండ్‌ సాస్

మనలో చాలా మంది అల్పాహారం సమయంలో ఆహారంతో పాటు కెచప్ లేదా సాస్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా సాస్ లేదా కెచప్ తినేందుకు ఆసక్తి చూపుతారు. అయితే వీటిలో రకరకాల కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటితో మన శరీరానికి హాని కలుగుతుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఎక్కువవుతాయి.

ఆర్టీఫిషియల్‌ స్వీటెనర్లు..

బరువు తగ్గాలనుకుంటే లేదా మధుమేహం , ప్రీడయాబెటిస్ వంటి పరిస్థితులను నివారించాలనుకుంటే చక్కెరను కృత్రిమ స్వీటెనర్లతో భర్తీ చేయాలనే భావన చాలా సంవత్సరాలుగా ఉంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించడం ప్రారంభించారు. ముఖ్యంగా డయాబెటిస్‌ బాధితులు , ఒబెసిటీ బాధితులు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒక అధ్యయనంలో, జంతువులపై కృత్రిమ స్వీటెనర్లపై పరిశోధన జరిగింది. ఫలితంగా బరువు పెరగడం, మెదడు కణితులు, మూత్రాశయ క్యాన్సర్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తేలింది. కాబట్టి కృత్రిమ చక్కెరలను వీలైనంతవరకు దూరంగా ఉంచాలి.వీటికి బదులు తేనే, బెల్లం వంటి ప్రత్యామ్నాయ పదార్థాలు తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. తారకరాముడి స్పందనేంటి?.. ‘రజనీతో రామ్’.. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌..

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్