Health: మగవారికి అలర్ట్.. ఈ నీటిని తాగితే ఆ హార్మోన్ బ్యాలెన్సింగ్ గా ఉంటుందట.. అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఎండన పడి, బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికొచ్చాక చల్లని నీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత, ఆధునిక సౌకర్యాల కారణంగా ప్రతి ఒక్కరి..

ఎండన పడి, బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికొచ్చాక చల్లని నీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత, ఆధునిక సౌకర్యాల కారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్లు వచ్చేశాయి. కానీ ఫ్రిజ్ లు లేని పూర్వకాలంలో చల్లగా ఉండేందుకు మట్టి కుండల్లో నీటిని నిల్వ చేసుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం.. మట్టికుండలోని నీటిని తాగితే శరీరంలో వేడి బ్యాలెన్స్ అవుతుంది. అంతే కాకుండా నీటి ఆమ్ల స్వభావాన్ని తగ్గించి, పీహెచ్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. కుండలోని నీటిని తాగడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. గుండెల్లో మంట, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. జీవక్రియను పెంచుతుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఇవి నీటి ఉష్ణోగ్రతను 5 డిగ్రీల వరకు తగ్గిస్తాయి. వేసవిలో ఎక్కువగా వడదెబ్బకు గురవుతుంటారు. వారికి కుండలోని నీటిని క్రమం తప్పకుండా తాగించడం వల్ల సమస్య తగ్గుతుంది.
మట్టిలో ఉండే వివిధ రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు నీటిలో చేరతాయి. అవి శరీర ఆరోగ్యానికి సహాయపడతాయి. మట్టికుండలకు కంటికి కనిపించని చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఇవి నీటిని చల్లగా మారేలా చేస్తాయి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా నీటి ఉష్ణోగ్రతలు మారతాయి. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే కుండలో నీరు చల్లగా, బయట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే వెచ్చగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ప్టాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ ఉంచిన నీటిని తాగడం అలవాటైపోయింది. వీటిలో ఉండే హానికారక రసాయనాల వల్ల నీరు కలుషితమవుతోంది. కానీ మట్టి పాత్రల విషయంలో ఇలా జరగదు. వీటిలో నిల్వ చేసిన నీరు కలుషితం అయ్యే అవకాశమే లేదు.
సాధారణంగా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీటిని తాగితే కొందరిలో గొంతు, జలుబు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఆస్తమా సమస్యతో ఉన్నవారైతే ఫ్రిజ్‌లో ఉంచిన నీటికి చాలా దూరంగా ఉంటారు. కుండలో ఉంచిన నీటిని తాగడం వల్ల అలాంటి సమస్యలేమీ ఎదురుకావు. కుండలో నిల్వ ఉంచిన నీరు ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.




నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి
అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. తారకరాముడి స్పందనేంటి?.. ‘రజనీతో రామ్’.. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్..



