AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: మోదీ నల్లచట్టాలకి కేసీఆర్‌ సపోర్టు చేశారు.. చేనేత కోసం టీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేదన్న రాహుల్‌

ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ పనైతే చేస్తోందో అదే పనిని తెలంగాణలో TRS చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే చేనేతపై విధించిన జీఎస్‌టీపై పరిహారం చెల్లిస్తామని రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు.

Rahul Gandhi: మోదీ నల్లచట్టాలకి కేసీఆర్‌ సపోర్టు చేశారు.. చేనేత కోసం టీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేదన్న రాహుల్‌
Rahul Gandhi
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2022 | 10:27 PM

Share

తెలంగాణలో 4వ రోజు భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగింది. ఉదయం 6 గంటలకు ధర్మాపూర్‌లో మొదలైన పాదయాత్ర రాత్రికి జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వరకు సాగింది. కొందరు చిన్న పిల్లలు రాహుల్‌ను కలిసి ఆయన వెంట కొద్ది దూరం నడిచారు. చేనేతపై GST విధించడాన్ని రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. చేనేత కార్మికులు, పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధులు రాహుల్‌ గాంధీని కలిశారు. చేనేతపై GST విధించడాన్ని రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే GSTపై పరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు యాత్రలో రాహుల్‌ వెంట నడిచారు. సినీతార పూనమ్‌ కౌర్‌ కూడా రాహుల్‌ గాంధీని కలిశారు.

సాయంత్రం మహబూబ్‌నగర్‌ శివారు ఎనుకొండ నుంచి యాత్ర సాగింది. గొల్లపల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ తెలంగాణలో విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని TRSపై నిప్పులు చెరిగారు. BJP- TRS రెండు ఒకటేనని ఆరోపించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్‌పరం చేస్తున్నారు. కాలేజీలు, స్కూల్స్‌, యూనివర్సిటీలన్నీ కూడా ప్రైవేట్‌ వారి చేతుల్లో పెడుతున్నారు. పేద ప్రజలు, రైతుల పిల్లలు, కార్మికుల పిల్లలకు ఎక్కువ నష్టం జరుగుతుంది.

దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని రాహుల్‌ గాంధీ తెలిపారు. TRS, BJP రాజకీయ పార్టీలు కాదని అవి వ్యాపార సంస్థలని రాహుల్‌ ఆరోపించారు. ధరణి పోర్టల్‌ పనితీరును కూడా రాహుల్‌ తప్పుబట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం