Araku: మంచు దుప్పటి కప్పుకున్న మాడగడ.. పోటెత్తుతున్న పర్యాటకులు.. ప్రాచుర్యం కల్పించాలని కోరుతున్న స్థానికులు

పర్యాటకులే కాకుండా అరకులోయలోని స్థానికులు కూడా కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ మాడగడ మేఘసంద్రాన్ని చూసేందుకు తరలిరావడం విశేషం. చిన్నపాటి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినప్పటికీ యువకులు చోరవ చూపడంతో పర్యాటకుల ప్రశాంతంగా ఈ అందాలను వీక్షించారు

Araku: మంచు దుప్పటి కప్పుకున్న మాడగడ.. పోటెత్తుతున్న  పర్యాటకులు.. ప్రాచుర్యం కల్పించాలని కోరుతున్న స్థానికులు
Araku
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2022 | 2:22 PM

అల్లూరి సీతారామ జిల్లా అరకులోయ మండలంలోని మంచు మేఘాలతో సముద్రంలా కనువిందు చేస్తున్న మాడగడకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ పొగమంచు అందాలను ఆస్వాదించేందుకు జనం తరలివస్తున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి పర్యాటకులు భారులు తీరారు. పర్యాటాకుల ఊహలకు తగ్గట్టుగానే తెల్లవారుజాము నుంచి చుట్టూ ఉన్న కొండల మధ్యలో మేఘాలతో ప్రకృతి పాల కడలిలా కమ్మేసింది. దీంతో పర్యాటకులు ఉత్సాహంగా ఉరకలు వేస్తూ పొగమంచును ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగుతూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అరకులోయ కు 8 కిలోమీటర్ల దూరంలో ఇంత అద్భుత అందం ఇన్నాళ్లు దాగుందా అంటూ పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చాలామంది చలిమంటలను కాచుకుంటూ తెల్లవారి నుంచి ఈ అందాల కోసం వెయిట్ చేసారు. పర్యాటకులే కాకుండా అరకులోయలోని స్థానికులు కూడా కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ మాడగడ మేఘసంద్రాన్ని చూసేందుకు తరలిరావడం విశేషం. చిన్నపాటి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినప్పటికీ యువకులు చోరవ చూపడంతో పర్యాటకుల ప్రశాంతంగా ఈ అందాలను వీక్షించారు. మరికొన్ని సదుపాయాలు కల్పించి మరింత ప్రాచుర్యంలోకి తీసుకువస్తే ఈ మాడగడ మేఘసంద్రం మరింత గుర్తింపు లోకి వస్తుందని అంటున్నారు పర్యాటకులు.

సుమారు నాలుగు నెలలు పాటు మేఘాలు ఇలాగే కనువిందు చేస్తాయని, చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటాయని చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు  తెలియజేశారు. పాడేరు ఐటిడిఏ. పర్యాటక శాఖ వారు మాడగడ మేఘసంద్రానికి వెళ్లే త్రోవను మెరుగుపరిచి పార్కింగ్కు సరైన సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఈ అందాలను తిలకించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.