Actress Namita: శ్రీవారిని దర్శించుకున్న నమిత.. పాలిటిక్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన నమిత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తనకు సినిమాల కంటే రాజకీయాలపై ఆసక్తి ఉందని, సరైన సమయం చూసుకుని పాలిటిక్స్‌లోకి అడుగుపెడతానని చెప్పుకొచ్చింది.
ప్రముఖ సినీనటి నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్తతో కలిసి ఇవాళ (అక్టోబర్ 30) ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలిసి స్వామివారి సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా టీటీడీ ఆలయ ఆధికారులు నమిద దంపతులకు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన నమిత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తనకు సినిమాల కంటే రాజకీయాలపై ఆసక్తి ఉందని, సరైన సమయం చూసుకుని పాలిటిక్స్‌లోకి అడుగుపెడతానని చెప్పుకొచ్చింది. కాగా సొంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నమిత. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సింహా సినిమాలో బాలయ్యతో కలిసి ఓ స్పెషల్ సాంగులో స్టెప్పులేసింది.
ఇక నమిత వ్యక్తిగత విషయానికొస్తే.. 2017లో వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుందామె. తమ ప్రేమ బంధానికి గుర్తింపుగా ఈ ఏడాది ఆగస్టులో పండంటి కవలలకు జన్మనిచ్చింది. కాగా ఇటీవల డీఎంకే నేత సాధిక్ ఖుష్బూతో పాటు నమిత, గౌతమి, గాయత్రీ రాఘవన్ అందరూ ఐటమ్సే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి..
అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. తారకరాముడి స్పందనేంటి?.. ‘రజనీతో రామ్’.. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్..