Mithila Palkar: మిథిలా అందమే కాదు స్వరం కూడా మధురమే.. తెలుగులో ఎంత బాగా పాటపాడిందో చూడండి
అయితే ఈ మధ్య మాత్రం హీరోయిన్ తెలుగులో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొంతమంది కష్టపడి నేర్చుకొని తమ ఓన్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.
ఇప్పటి హీరోయిన్స్ కు తెలుగు మాట్లాడటం చాలా కష్టం.. అందం అభినయం ఉన్నా.. తెలుగులో మాత్రం మాట్లాడలేరు ఈ ముద్దుగుమ్మలు. అయితే ఈ మధ్య మాత్రం హీరోయిన్ తెలుగులో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొంతమంది కష్టపడి నేర్చుకొని తమ ఓన్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇంకొంతమంది సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో వచ్చి రాని తెలుగు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు. ఇక ఇంకొంతమంది ఏకంగా తెలుగులో పాటలు కూడా పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమలోని సింగింగ్ టాలెంట్ ను బయట పెట్టారు. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా తాను నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో సాంగ్ ను ప్రమోషన్స్ లో t తెలుగులో పాడి అలరించింది. తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా తెలుగులో పాట పాడింది.
ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. మిథిలా పాల్కర్. ఈ ముద్దుగుమ్మ ఇటీవల విశ్వక్ సేన్ నటించిన ఓరిదేవుడా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా కంటే ముందు పలు వెబ్ సిరీస్ లలో నటించింది ఈ చిన్నది. ఇక ఓరి దేవుడా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మంచి సక్సెస్ ను కూడా అందుకుంది.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనలోని సింగింగ్ టాలెంట్ ను బయట పెట్టింది. కింగ్ నాగార్జున నటించిన క్రిమినల్ సినిమాలోని తెలుసా మనసా పాటను అద్భుతంగా అలరించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సూపర్ టాలెంటెడ్ బ్యూటీ ఇప్పుడుతెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటోంది. త్వరలోనే ఒక సినిమాకు ఈమె సైన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.