Megastar Chiranjeevi: ‘ఆపద వస్తే అన్నయ్య వచ్చేస్తాడు’.. సమంత అనారోగ్యంపై స్పందించిన మెగాస్టార్
ఏం మాయ చేశావే"తో అందరిని మాయ చేశావ్. ఇప్పుడు మయోసైటిస్‌ను కూడా మాయ చేసి మళ్లీ మా ముందుకు వచ్చేస్తావ్. ఓ మై బేబీ, నువ్వు పడి లేచే కెరటానివి. కమాన్ బేబీ, వి ఆర్ విత్ యూ. ప్రేయింగ్ ఫర్ యూ. ఫైట్ బేబీ ఫైట్ అంటున్నారు సామ్ ఫ్యాన్స్.
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచంతో పంచుకుంది. టాలీవుడ్ బ్యూటీ సమంత అనారోగ్యం.. ఇప్పుడు ఇంస్ట్రీస్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ క్రమంలో సమంత ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని, సుశాంత్ సహా పలువురు నటీనటులు సమంత త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. తాజాగా సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయి.. బహుశా మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి కావొచ్చు. లోపల ఎంతో శక్తి ఉన్న ఒక అద్భుతమైన అమ్మాయివి నీవు. అతి త్వరలోనే ఈ అనారోగ్య సమస్య నుంచి బయపడుతావని బలంగా విశ్వశిస్తున్నాను. ప్రకృతి నీతో ఉంది.. త్వరగా కోలుకో సమంత’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Wishing you speedy recovery!!@Samanthaprabhu2 pic.twitter.com/ZWGUv767VD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 30, 2022
సామ్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. ఆమె పడినా లేస్తుంది.. పోరాడుతుంది…
స్టార్ హీరోయిన్ సమంత…ఆమె జీవితంలో ఎన్ని శిఖరాలు ఉన్నాయో అన్ని అగాధాలు కూడా ఉన్నాయి. గాయం ఎంత పెద్దదయినా సరే, ఎవ్వరినీ చివరకు కన్నవాళ్లను కూడా సాయం అడగదు సామ్. ఒంటరిగా పోరాడుతుంది. పోరాడి పోరాడి గెలిచి నిలుస్తుంది. ఆమె ఎప్పుడూ ఓ పడి లేచిన కెరటమే. పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లనమ్రోవికి తాకితే గేయాలు అన్నట్టు…సామ్ చుట్టూ ఎంత అందమైన కథ ఉందో ఆమె గుండెల్లో అంత వ్యథ కూడా ఉంది. పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది సమంత. పదేళ్ల క్రితం సమంత సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఆమె ముఖంలో మార్పులు వచ్చాయి. ఆమెలో మాత్రం ఏ మార్పు రాలేదు. జోరుగా హుషారుగా సాగిపోయింది. తెరపై స్టార్‌హీరోయిన్‌గా వెలిగిపోయింది.
అప్పట్లో మొదట సిద్ధార్థ్‌తో అఫైర్ వార్తలు…విడిపోయిన వార్తలు…ఆమెను ఎమోషనల్‌గా కొంత ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడింది సమంత. 2010లో విడుదలైన ‘ఏం మాయ చేశావే’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించినప్పటి నుంచి సమంత, నాగచైతన్యల మధ్య పరిచయం పెరిగింది. ఏడేళ్ల పరిచయం ప్రేమగా మారి 2017 అక్టోబర్ 6వ తేదీన గోవాలో హిందు, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత భేదాభిప్రాయాలు తలెత్తి ఇద్దరూ 2021లో విడిపోయారు. ఇది కూడా సామ్‌ను ఎమోషనల్‌గా బాగా డిస్టర్బ్ చేసింది.
ఇక అప్పటినుంచి ఏదో ఒక రూపంలో సమంత తన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షో లో చాలా విషయాలపై బోల్డ్ గానే మాట్లాడింది. పెళ్లంటే కబీ ఖుషి కభీ గమ్ సినిమాలా ఉంటుందని అనుకున్నానని, కానీ అందులోకి దిగాక అది కేజీఎఫ్ అని అర్థమైందని కుండబద్దలు కొట్టింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆమెపై భారీగానే దాడి జరిగింది. ఈ సమయంలో సమయమనం పాటించినా.. కొన్నిసార్లు మాత్రం తన ఆగ్రహాన్ని దాచుకోలేక ముక్కుసూటిగానే సమాధానం చెప్పింది.
అప్పట్లో విడాకుల ప్రకటనకు కొన్ని గంటల ముందు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశారు. గర్భంతో ఉన్న ఒక మహిళ తన పొట్టపై ప్రేమ సంకేతంగా రెండు చేతులతో హృదయాకారాన్ని చూపించే ఫొటోను ఈ పోస్ట్ కోసం వాడారు. అలాగే ‘మా అమ్మ చెప్పింది’ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. ‘‘నేను నిరాశలో ఉన్నప్పుడు ఒకటి గుర్తు చేసుకుంటాను. అదేంటంటే.. చరిత్రలో నిజం, ప్రేమ ఎల్లప్పుడూ విజయం సాధించాయి. కొంత కాలం పాటు నిరంకుశులు, హంతకులే అజేయులుగా ఉన్నారు. కానీ, చివర్లో మాత్రం వాళ్లు ఎల్లప్పుడూ ఓడిపోయారు. దీని గురించి ఆలోచించు.. ఎప్పుడూ’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. తనపై వచ్చే ట్రోలింగ్‌పై ఒకసారి స్పందిస్తూ… ”ఇప్పుడు అలవాటైపోయింది. టైమ్ అన్నీ నేర్పిస్తుంది”అని ఆమె వివరించారు.
వ్యక్తిగత జీవితంలో సమంత మానసికంగా బాగా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయితే సైకలాజికల్‌గా బాగా డిస్టర్బ్ అయి విపరీతంగా ఆలోచించినప్పుడు కూడా మయోసైటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందులు లేనప్పటికీ ఒంటరిగా ఉన్నప్పుడు గతం తాలూకూ తేనెతుట్టె కదిలి జ్ఞాపకాలు దాడి చేస్తూనే ఉంటాయి. దీనికితోడు మయోసైటిస్ కూడా దాడి చేస్తోంది. అయినా పడి లేచే కెరటం లాంటి సమంత దీనిని ఎదుర్కొని మళ్లీ అతి త్వరలో మనల్ని తెరపై కలుస్తుందని ఆశిద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..