AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: న్యాచురల్ స్టార్‏తో కామెడీ మాములుగా ఉండదు.. చిట్టితో హైట్ సరిపోయేందుకు నాని చేసిన పని చూస్తే నవ్వాగదు..

జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఇప్పుడు లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాతో థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న

Nani: న్యాచురల్ స్టార్‏తో కామెడీ మాములుగా ఉండదు.. చిట్టితో హైట్ సరిపోయేందుకు నాని చేసిన పని చూస్తే నవ్వాగదు..
Nani, Faria
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2022 | 1:14 PM

Share

న్యాచురల్ స్టార్ నాని.. వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్‏లోనూ ఎంతో సరదాగా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనదైన కామెడీ టైమింగ్‏తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. రియాల్టీ గేమ్ షోలలో నాని చేసే అల్లరి మాములుగా ఉండదు. తాజాగా న్యాచురల్ స్టార్ చేసిన ఓ చిలిపి పని ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. హీరోయిన్‏తో తన హైట్ సరిపోయేందుకు నాని చేసిన పని చూస్తే నవ్వాగదు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ? .. అదేనండి.. చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఇప్పుడు లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాతో థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హజరయ్యారు.

ఈ క్రమంలోనే చిత్రయూనిట్ సభ్యులతో కలిసి స్జేజ్ పై నిల్చున్నారు నాని. ఆ సమయంలో నాని పక్కన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నిల్చుంది. వాస్తవానికి ఫరియా హైట్ చాలా ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఇక నాని అయ్యప్ప దీక్షలో ఉండడంతో చెప్పులు వేసుకోలేదు. దీంతో ఫరియా పక్కన నాని తక్కువ హైట్ గా కనిపించాడు. అదే సమయంలో హీరో సంతోష్ ను మధ్యలోకి రావాల్సిందిగా కోరాడు. అయితే సంతోష్ రాకుండా పక్కనే ఉన్నాడు. మరోవైపు మీడియా సభ్యులు ఫోటోస్ తీస్తుండగా.. నాని తన హైట్ కవర్ చేసేందుకు సరదాగా తన కాలి వేళ్ళపై నిలబడేందుకు డ్రై చేశాడు.దీంతో ఫరియా ఒక్కసారిగా నవ్వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం నాని దసరా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us