Ram Charan: ఆఫ్రికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ దంపతులు.. టాంజానియా అడవుల్లో చెర్రీ..

ప్రస్తుతం ఆఫ్రికాలోని అడవి ప్రాంతంలో చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంటూ.. వన్యప్రాణులను ఫోటోస్ తీస్తూ కనిపించారు

Ram Charan: ఆఫ్రికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ దంపతులు.. టాంజానియా అడవుల్లో చెర్రీ..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 30, 2022 | 1:43 PM

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తు్న్నారు. ఇటీవలే ఈ మూవీ జపాన్‏లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ జపాన్‏లో సందడి చేశారు. అక్కడ ట్రిపుల్ ఆర్ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇక జపాన్ నుంచి రామ్ చరణ్ దంపతులు ఆఫ్రికా చేరుకున్నారు. ప్రస్తుతం ఆఫ్రికాలోని అడవి ప్రాంతంలో చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంటూ.. వన్యప్రాణులను ఫోటోస్ తీస్తూ కనిపించారు చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

చెర్రీకి మొదటి నుంచి ఫోటోగ్రఫిపై మంచి ఆసక్తి ఉంది. ఇక తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియోలో చరణ్ స్వయంగా కార్ డ్రైవ్ చేస్తూ ఆఫ్రికా అడవుల్లోకి వెళ్లారు. అక్కడ పులిని.. వన్యప్రాణులను ఫోటోస్ తీయడం గమనించవచ్చు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ విజయాన్ని చరణ్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. కీలకపాత్రలో మరో హీరోయిన్ అంజలి కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో చరణ్.. డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల ఈ సినిమా నుంచి లీకైన ఫోటోస్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.