AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaya Bachchan: ‘పెళ్లి కాకుండానే పిల్లలను కనడం తప్పుకాదు’.. బిగ్ బి భార్య షాకింగ్ కామెంట్స్..

ఇలా మాట్లాడితే ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారు. కానీ శారీరక ఆకర్షణ.. అనుకూలత చాలా ముఖ్యమైనవి. మా కాలంలో మేము ఎలాంటి ప్రయోగాలు చేయలేదు.

Jaya Bachchan: 'పెళ్లి కాకుండానే పిల్లలను కనడం తప్పుకాదు'.. బిగ్ బి భార్య షాకింగ్ కామెంట్స్..
Jaya Bachchan
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2022 | 12:20 PM

Share

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి జయ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు జయ. ఇటీవల దీపావళి వేడుకల సందర్భంగా కెమెర్లమెన్స్ పై జయ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వార్తల్లో నిలిచారు. తమ వ్యక్తిగత విషయాలను.. ఫోటోలను అనుమతి లేకుండా తీస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక తాజాగా మరోసారి జయ బచ్చన్ తన మనవరాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కూతురు శ్వేతా బచ్చన్ నందా కుమార్తె నవ్య నవేలి నందా పెళ్లి కాకుండానే పిల్లలను కంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంతేకాకుండా ఎలాంటి రిలేషన్ షిప్ అయినా కొనసాగించాలంటే శారీరక ఆకర్షణ తప్పనిసరి అని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాశంగా మారాయి.

ఇటీవల నవ్య పోడ్ కాస్ట్.. వాట్ ది హెల్ నవ్యలో జయ బచ్చన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన మనవరాలితో ఓపెన్ గా మాట్లాడారు జయ. తన మనవరాలు పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జయ మాట్లాడుతూ.. ” ఇలా మాట్లాడితే ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారు. కానీ శారీరక ఆకర్షణ.. అనుకూలత చాలా ముఖ్యమైనవి. మా కాలంలో మేము ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. కానీ నేటి తరం అలా కాదు. అన్ని సాహాసాలు చేస్తుంది. ఎందుకు చేయకూడదు ? అంటే.. వారు దీర్ఘకాలిక సంబంధానికి కూడా బాధ్యత వహిస్తారు. అలాంటి వ్యక్తులు శారీరక సంబంధంలో లేకుంటే వారు సంబంధం ఎక్కువ రోజులు కొనసాగదు. వారు ప్రేమ, స్వచ్చమైన గాలి.. అనుకూలతతో ఎక్కువ రోజులు జీవించలేరు. ఇవే ఓ అందమైన రిలేషన్ షిప్ కు ముఖ్యమైనవి అని భావిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.

కొన్నిసార్లు యువతను చూస్తే జాలిగా ఉంటుంది. వాస్తవానికి వారి గురించి మనం ఎప్పటికీ ఆలోచించలేము. కానీ నా తర్వాత కూడా యువతరం, శ్వేత తరం .. నవ్వకు చాలా కొత్తగా.. విభిన్నంగా ఉంటుంది. వారు ఇదే దారిలో వెళ్తే నేరాన్ని అనుభవిస్తారు. అది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు శారీరక సంబంధంలో ఉండి.. అయినా బంధం కుదరకపోతే మీరు దాని గురించి మంచిగా ఉండవచ్చు అంటూ చెప్పుకొచ్చారు జయ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.