Balakrishna: అల్లు హీరో కోసం రంగంలోకి నందమూరి బాలకృష్ణ.. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..

ప్రస్తుతం బాలయ్య.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహరెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

Balakrishna: అల్లు హీరో కోసం రంగంలోకి నందమూరి బాలకృష్ణ.. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 30, 2022 | 12:20 PM

చాలా కాలం తర్వాత యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శిరీష్ సరసన అనుఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. నవంబర్ 4న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఆదివారం (అక్టోబర్ 30)న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అల్లు శిరీష్. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా విజయవాడలోని ఇడ్లీపాకలో టిఫిన్ చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు అల్లు శిరీష్. అలాగే కాకినాడిలోని సుబ్బయ్యగారి హోటల్లో చిత్రయూనిట్ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలయ్య.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహరెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే