- Telugu News Photo Gallery Cinema photos Samantha new post about she sickness goes viral in social media Telugu Actors Photos
Samantha: ‘జీవితం నాకు సవాళ్లు విసురుతోంది.. వారి ప్రేమ ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు శక్తినిస్తుంది’.. అనారోగ్యంపై సమంత..
జీవితం తనకు అనేక సవాళ్లు విసురుతోందని, అదే సమయంలో ప్రేక్షకులు చూపే ప్రేమ వాటిని అధిగమించే శక్తిని ఇస్తోందని సమంతా పోస్ట్ చేశారు. అంతే కాదు కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాంతకమైన మైయోసైటిస్ అనే వ్యాధి ఉందనే విషయం తెలిసిందని వెల్లడించారు.
Updated on: Oct 30, 2022 | 1:16 PM

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోదా వచ్చే నెల 11న విడుదల కానుంది. సరోగసీపై రూపొందించిన ఈ చిత్రం సమంత టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తెలుగు- తమిళ్‌లో సైమల్‌టెనియస్‌గా సినిమా రూపొందించారు.

ఈ సినిమా విడుదల సందర్భంగా సమంతా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మ్యాటర్ సంచలనం సృష్టిస్తోంది. యశోదా ట్రైలర్‌కు వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని ట్వీట్ చేసిన సమంత అందులో ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు.

జీవితం తనకు అనేక సవాళ్లు విసురుతోందని, అదే సమయంలో ప్రేక్షకులు చూపే ప్రేమ వాటిని అధిగమించే శక్తిని ఇస్తోందని సమంతా పోస్ట్ చేశారు.

అంతే కాదు కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాంతకమైన మైయోసైటిస్ అనే వ్యాధి ఉందనే విషయం తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం అది తగ్గుముఖం పట్టిందని తెలిపారు.

అంతే కాదు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఫొటో సమంత షేర్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే తాను పూర్తిగా కోలుకోగలనని డాక్టర్లు చెప్పారని సమంత పోస్ట్ చేశారు.కాని కోలుకునేందుకు ఊహించిన దానికన్నా ఎక్కువ సమయం పడుతోందని అన్నారు.

ఈ వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు తాను కష్టపడుతున్నానని ఆమె అన్నారు, భౌతికంగానూ, మానసికంగానూ తనకు మంచి రోజులు, దుర్దినాలలు ఉన్నాయని ఒకింత ఆవేదనను ఈ పోస్టులో సమంత షేర్ చేశారు.

రికవరీకి తాను కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నానని సమంత అన్నారు. నవంబర్ రెండు నుంచి యశోదా సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్‌లో సమంత పాల్గొనే అవకాశం ఉంది.

సమంతకు వచ్చిన మైయోసైటిస్ వ్యాధి అత్యంత అరుదైనదని చెప్పాలి. ఇది రోగనిరోధకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి.

నిల్చునేందుకు కూడా వారికి శక్తి ఉండదు. కండరాలన్నీ బలహీనంగా మారతాయి, నొప్పులు విపరీతంగా ఉంటాయి.

సమంత న్యూ ఫోటోషూట్ పై మీ కామెంట్..?





























