Moinabad Farmhouse Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసు.. ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్‌

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ముగ్గురు నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది కోర్టు. రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిలకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది..

Moinabad Farmhouse Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసు.. ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్‌
Moinabad Farmhouse Case
Follow us
Subhash Goud

|

Updated on: Oct 29, 2022 | 10:53 PM

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ముగ్గురు నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది కోర్టు. రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిలకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది ఏసీబీ కోర్టు. నవంబర్‌ 11 వరకు నిందితులకు రిమాండ్‌ కొనసాగనుంది. ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుల రిమాండ్‌ను ఆపాలని నిందితుల తరపున న్యాయవాది కోరగా, అందుకు న్యాయవాది అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు నిందితులను 7 రోజుల కస్టడీని కోరగా, అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు.

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిలను అదుపులో తీసుకున్న సైబరాబాద్‌ పోలీసులు మొయినాబాద్‌ పోలీసుస్టేషన్‌కు తరలించి మరో వాగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సరూర్‌నగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యామూర్తి నివాసానికి తీసుకువచ్చి జడ్జి ముందు హాజరు పర్చారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. కాగా, ఆరోగ్య పరిస్థితిపై రామచంద్రభారతి పిటిషన్‌ దాఖలు చేయగా, సోమవారం విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. జైలులో వైద్య సదుపాయాలు కల్పించాలని నిందితుల తరపున న్యాయవాదులు కోర్టును కోరారు.

కాగా, ఇప్పుడు తెలంగాణలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హట్‌టాపిగ్గా మారింది. అటు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడి రాజుకుంది. అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఒక వైపు ఉప ఎన్నిక ప్రచారంలో జోరుగా కొనసాగుతుంటే.. మరో వైపు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి