Moinabad Case: ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో కీలక నిందితుడు రామచంద్రభారతి.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే బాక్స్ బద్దలే..

రామచంద్రభారతి.. ఇప్పుడిదే పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తెలంగాణ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఎవరన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Moinabad Case: ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో కీలక నిందితుడు రామచంద్రభారతి.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే బాక్స్ బద్దలే..
Ramachandra Bharathi
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 29, 2022 | 10:28 PM

రామచంద్రభారతి.. ఇప్పుడిదే పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తెలంగాణ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఎవరన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అవును రామచంద్రభారతి.. స్వామీజీయా? బీజేపీ లీడరా? స్వామీజీ ముసుగులో ఉన్న బీజేపీ ఏజెంటా అన్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు. అయితే, రామచంద్రభారతి చిరునామా కోసం ఫరీదాబాద్ వెళ్లిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిపాయి.

రామచంద్రభారతి అరెస్ట్‌తో ఢిల్లీ ఫరీదాబాద్‌లోని సెక్టార్‌ 31 కాలనీ వాసులు షాక్‌కు గురవుతున్నారు. జీవనోపాధి కోసం లోకల్‌గా ఉండే ఓ చిన్న గుడిలో పూజారిగా ఉండే ఆయన వెనుక ఇంత తతంగం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. స్థానికంగా ఆయన్ను సతీష్‌ శర్మగానే చెబుతున్నారు. బహుశా ఈ రామచంద్రభారతి అనే పేరు పెద్ద పెద్ద పనులకు మాత్రమే వాడతారేమో అంటున్నారు. గ్రూప్‌హౌస్‌ను పోలిన అపార్ట్‌మెంట్‌లో ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉండే సతీష్‌ శర్మ పెద్దగా ఎవరితోనూ కలవరన్నది స్థానికులు చెబుతున్నమాట. తమకు తెలిసింది సతీష్‌శర్మ మాత్రమే అని, రామచంద్రభారతి పేరు వెనుక ఇంత ఉందా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు ఆయన ఇరుగుపొరుగు. ఏళ్లుగా నివాసముంటున్నా.. అతడి పేరు చెబితే.. ఎవరాయన అంటూ అమాయకంగా తిరిగి ప్రశ్నిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులోనే ఉంటాడని.. పొరుగింటికి చెందిన పీసీ రాణా చెబుతున్నారు. అతను సౌతిండియాకు చెందినవాడిగా.. గుళ్లలో పూజలు చేసేవ్యక్తిగానే తెలుసన్నారు. రామచంద్రభారతి గురించి అంతకు మించి తెలియదంటున్నారు.

అటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సైతం రామచంద్రభారతిపై అనుమానం వ్యక్తంచేశారు. ఢిల్లీలో 43 మంది ఆప్‌ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నంలోనూ ఇతడి హస్తం ఉందని ఆరోపించారు. మొత్తంగా రామచంద్రభారతి చీకటి వ్యవహారంలో ఎన్ని డీల్స్‌ ఉన్నాయన్నది మరింత ఆసక్తి రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..