Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Care: చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఈ ఆహారాలను తినండి..

సీజన్‌కు ఒక సమస్య ఎదురవుతుంది. వాటిని తట్టుకుని నిలబడాలంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇక చలికాలం వచ్చిందంటే చాలు..

Winter Care: చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఈ ఆహారాలను తినండి..
Skin Care
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 29, 2022 | 9:29 AM

సీజన్‌కు ఒక సమస్య ఎదురవుతుంది. వాటిని తట్టుకుని నిలబడాలంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇక చలికాలం వచ్చిందంటే చాలు.. చలి గాలులతో ఇబ్బంది పడుతుంటారు జనాలు. చలి గాలుల కారణంగా చర్మం పొడిబారడం మొదలవుతుంది. వింటర్ సీజన్‌లో చర్మ సంరక్షణ అనేది ఒక ఛాలెంజ్‌లా ఉంటుంది. అయితే, డైట్‌లో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే పొడి చర్మం సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు. అలాగే ఈ సమస్య నుంచి బయటపడేందుకు మాయిశ్చరైజర్లు, ఇతర క్రీమ్స్, ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు.

అయితే, ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి సరి చేస్తుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. క్రీమ్స్, ఇతర మాయిశ్చరైజర్లు పై నుండి మాత్రమే పని చేస్తాయి. చలికాలంలో పొడి చర్మం సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నీరు త్రాగాలి..

ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం.. శీతాకాలంలో చాలా మంది నీటిని తాగడం తగ్గిస్తారు. దీని కారణంగా చర్మం పొడిబారుతుంది. అందుకే శీతాకాలం అయినప్పటికీ నీటిని పుష్కలంగా తీసుకోవాలి. అలాగే డైట్‌లో మంచి ఫుడ్ తీసుకోవాలి. చర్మం సమస్య చాలా వరకు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

నట్స్..

వాల్‌నట్‌లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, హాజెల్‌నట్స్, బాదం వంటివి శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి, ఎందుకంటే వాటిలో ఒమేగా 3, ఒమేగా 6 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చర్మాన్ని తేమగా ఉంచడంలో ఇవి చాలా మంచివి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

దోసకాయ..

చర్మం పొడిబారడం సమస్యను తగ్గించడంలో దోసకాయ సహాయపడుతుంది. అన్ని కూరగాయలతో పోలిస్తే ఇందులో అధిక నీరు శాతం ఉంటుంది. దీంతో పాటు, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి ఉండటం వల్ల చర్మానికి మరింత మేలు చేస్తుంది. శీతాకాలంలో దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఆకు కూరలు, సీజనల్ ఫ్రూట్స్..

బచ్చలికూర, బ్రోకలీ, క్యాబేజీ వంటి ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు చాలా ముఖ్యమైనవి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శీతాకాలంలో సీజనల్ పండ్లను తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..