Improve Memory: జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవాలంటే నిత్యం ఇలా చేయండి.. మార్పును 10 రోజుల్లో గుర్తించవచ్చు.. ఏం చేయాలంటే..

జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది.

Improve Memory: జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవాలంటే నిత్యం ఇలా చేయండి.. మార్పును 10 రోజుల్లో గుర్తించవచ్చు.. ఏం చేయాలంటే..
Improve Memory
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 29, 2022 | 3:13 PM

నిత్యం మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను శారీర‌కంగా చేస్తుంటాం. కానీ మాన‌సికంగా చేసే ప‌నుల‌కు మెద‌డు యాక్టివ్‌గా ఉండాలి. మెద‌డు చురుగ్గా ప‌నిచేయాలి. దీనికి తోడు జ్ఞాప‌క‌శ‌క్తి కూడా ఉండాలి. దీంతో మైండ్‌తోనూ మ‌నం చురుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతాం. క‌నుక మెద‌డు యాక్టివ్‌గా ఉండాల‌న్నా, జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాల‌న్నా అందుకు కింద తెలిపిన ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇల్లు, ఆఫీసు ద్వంద్వ జీవితం మన జ్ఞాపకశక్తిపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. మెదడు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది మన మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది. మన శరీరంలోని అన్ని అవయవాలు మనస్సు కోరిక మేరకు పనిచేస్తాయి. గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తుల ఊపిరి నుంచి నడక వరకు, మన మెదడు ప్రతిదానికీ అనుమతిని ఇస్తుంది. శరీరంలోని ఈ ముఖ్యమైన భాగాన్ని గుండెతో జాగ్రత్తగా చూసుకుంటే.. మెదడు ఎల్లప్పుడూ మెరుగ్గా పని చేస్తుంది. మంచి మెదడు ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం. మంచి ఆహారం మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మంచి ఆహారం మానసిక పనితీరును మెరుగుపరుస్తుంది. మరిచిపోయే అలవాటు మిమ్మల్ని కూడా బాధపెడుతుంటే.. మీరు మీ జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహారం, జ్ఞాపకశక్తి మధ్య సంబంధం ఏంటి..? ఆహారం జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకుందాం..

ఆహారం, జ్ఞాపకశక్తి మధ్య సంబంధం ఏంటి?

ఆహారం, మెదడు మధ్య సంబంధం చాలా బలమైనది. న్యూట్రిషనిస్టులు జ్ఞాపకశక్తి సమస్యల గురించి మనతో చాలా సార్లు వెల్లడిస్తుంటారు. అంతే కాదు కొన్ని చిట్కాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వృద్ధాప్యం జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు.

జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉదయం కాఫీ తాగండి..

తరచుగా ప్రజలు ఉదయం మేల్కొవడంతోనే కాఫీని తీసుకుంటారు. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది. కాఫీలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు, ఇవి మెదడును ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని రుజువు అయ్యింది. కాఫీలో ఉండే కెఫిన్ మెదడుపై చాలా సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎక్కువ సేపు కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి నరాల సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. మనం తీసుకునే కాఫీ ఫిల్టర్ కాఫీ.. స్వచ్చమైనది మాత్రమే ఇలా ఉత్సాహాన్ని ఇస్తుంది.

పసుపు పాలు తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..

పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి,మెదడుకు రెండింటికీ ఉపయోగపడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల పదార్ధం ఉంటుంది. ఇది మెదడులోకి ప్రవేశించి.. అక్కడి కణాలకు శక్తివంతం చేస్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం. పసుపును పాలతో కలిపి వాడితే మేలు జరుగుతుంది.

పజిల్స్ పరిష్కరించండి, మనస్సు పదునుగా ఉంచుకోవడం..

మీరు జ్ఞాపకశక్తిని మెరుగుపరచాలనుకుంటే.. ప్రతి రోజు కొన్ని పజిల్స్ పూరించండి. మెదడుకు ఇది గొప్ప వ్యాయామం. ఈ వ్యాయామం మెదడును చురుకుగా ఉంచుతుంది. చెస్, బోర్డ్ గేమ్స్ ఆడటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు 8 గంటలు నిద్రపోయే విధానాన్ని నిర్వహించడం మెదడును ఛార్జ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ధ్యానం చేయండి:

ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తిని చక్కగా ఉంచుతుంది. యోగా, ధ్యానం మీ జ్ఞాపకశక్తిని మరింత మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం