Winter Tips: శీతాకాలంలో బాగా ఇబ్బంది పెట్టే వ్యాధులివే.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు

ఇతర సీజన్లతో పోల్చితే శీతాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఈ మాసంలో దోమలు కూడా ఎక్కువగా విజృంభిస్తాయి. వాటి వల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

Winter Tips: శీతాకాలంలో బాగా ఇబ్బంది పెట్టే వ్యాధులివే.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు
Winter Problems
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2022 | 2:10 PM

వర్షాకాలం ముగిసిపోయింది. శీతాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే చాలాప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాబోయే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింతగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇతర సీజన్లతో పోల్చితే శీతాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఈ మాసంలో దోమలు కూడా ఎక్కువగా విజృంభిస్తాయి. వాటి వల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నవంబర్ నెల ప్రారంభంలో కొన్ని వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఆ రోగాలేంటో.. వాటి నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తెలుసుకుందాం రండి. శీతాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధుల లిస్టులో న్యుమోనియా ముందు వరుసలో ఉంటుంది.   బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌ల పెరుగుదల వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి ఇది. న్యుమోనియాను నివారించడానికి, వీలైనంత వరకు హైడ్రేటెడ్‌గా ఉండటం అవసరం. జ్వరం వస్తే అవసరమైన మందులు వేసుకోవాలి. వీటితో పాటు అల్లం, వెల్లుల్లిని మీ ఆహారంలో చేర్చుకోవాలి.

గొంతు ఇన్ఫెక్షన్

ఈ సీజన్‌లో గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. గొంతు ఇన్ఫెక్షన్ బాధాకరమైనది. ఈ సమస్యతో మాట్లాడడంతో పాటు తినడానికి కూడా కష్టంగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని నీటిలో కాస్త తేనెను కలుపుకుని తాగాలి. అలాగే ఐస్ క్రీం, వేయించిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి. శీతాకాలంలో గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.

సీజనల్‌ వ్యాధులు

నవంబర్‌లో చాలామంది తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడతారు. చల్లటి గాలుల కారణంగా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నొప్పి మరియు తల తిరగడం వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు చలి నుంచి రక్షణ కలిగించే దుస్తులు ధరించడం మంచిది. అలాగే నోరు, ముక్కులక అడ్డంగా స్కార్ఫ్‌ ధరించాలి. గోరువెచ్చని నీళ్లు బాగా తాగాలి.

ఇవి కూడా చదవండి

ఆర్థరైటిస్

చలికాలంలో ఈ కీళ్ల వ్యాధి సమస్య మరింత పెరుగుతుంది. ఇది మోకాళ్లలో వాపుకు కారణమవుతుంది. దీని నుంచి రక్షణ పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసువాలి. అలాగే అధిక బరువును నియంత్రించుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి